రోహిత్ పరుగుల దాహానికి అడ్డుకట్ట వేసే మొనగాడు ఏడి? మైఖేల్ క్లార్క్
భారత క్రికెట్ జట్టు ఓపెనర్ రోహిత్ శర్మ అద్భుత ఫామ్‌లో ఉన్నాడు. ప్రస్తుతం ఇంగ్లండ్‌తో జరుగుతున్న క్రికెట్ ప్రపంచ కప్ టోర్నీలో ఐదు సెంచరీలు చేసి సరికొత్త రికార్డును నెలకొల్పాడు. గత మూడు మ్యాచ్‌లలో వరుసగా సెంచరీలు కొట్టాడు.
దీనిపై ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ మైఖేల్ క్లార్క్ స్పందించాడు. రోహిత్ శర్మ అద్భుత ఫామ్‌లో ఉన్నాడనీ, అతని పరుగుల దాహాన్ని అడ్డుకునే మొనగాడు ఎవరున్నారంటూ ప్రశ్నించారు. పైగా, భారత్ సాధించిన విజయాల వెనుక రోహిత్ అద్భుత ప్రదర్శన దాగుందన్నారు.
అయితే, ఈ ప్రపంచ కప్‌లో భారత్ పదర్శన అత్యుత్తమంగా ఉన్నప్పటికీ న్యూజిలాండ్‌ను తక్కువగా అంచనా వేయవద్దని క్లార్క్ చెప్పాడు. అయితే, వరుసగా మూడు మ్యాచ్‌లలో ఓడిపోవడంతో ఆ జట్టులో ఆత్మవిశ్వాసం లోపించిందని చెప్పుకొచ్చాడు.