గిరిజన మహిళపై 12 మంది గూండాల సామూహిక అత్యాచారం
జార్ఖండ్ రాష్ట్రంలో ఓ గిరిజన మహిళపై 12 మంది గూడాలు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. రాష్ట్రంలోని పకూర్ జిల్లాలో వెలుగు చూసిన హేయమైన ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. ఈ కేసులోని బాధిత మహిళ ఢిల్లీలో పని చేస్తుండటం గమనార్హం. ఆమె వారం క్రితంమే ఢిల్లీ నుంచి తన సొంతూరుకు వెళ్ళింది. గత ఆదివారం సాయంత్రం ప్రియుడితో కలిసి బైకుపై కూర్చొని అంపాడుకు వెళ్లింది. అక్కడ తన ప్రియుడు ఓ స్వీట్ షాపులో స్వీట్స్ కొనుగోలు చేసి, అక్కడ నుంచి ఓ ఫుట్‌బాల్ మైదానానికి వెళ్లారు.
అక్కడ ఉన్న వున్న 12 మంది గూండాలు ఆ మహిళను నిర్బంధించి బలవంతంగా చెట్టుపక్కకు లాక్కెళ్లి వారంతా కలిసి అత్యాచారం చేసాడు. మరుసటి రోజు ఉదయం స్పృహలోకి వచ్చిన తర్వాత బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటన తర్వాత ప్రియుడు ప్రాణభయంతో అక్కడ నుంచి పారిపోయాడు. మహిళపై సామూహిక అత్యాచారం జరిగినట్టు జిల్లా ఎస్డీపీఓ అజిత్ కుమార్ తెలిపారు. బాధితురాలిని ప్రాథమి ఆరోగ్య కేంద్రానికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పరారీలో ఉన్న నిందితుల కోసం పోలీసుల గాలిస్తున్నారు.