గురువారం, 19 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 13 మే 2022 (22:02 IST)

బాలికను కిడ్నాప్ చేసి కారులో గ్యాంగ్ రేప్.. ఎక్కడ?

rape victim
జార్ఖండ్ రాష్ట్రంలో దారుణం జరిగింది. ఓ బాలికను కొందరు కామాంధులు కిడ్నాప్ చేశారు. ఆ బాలికను కారులో సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ దారుణం జార్ఖండ్ రాష్ట్ర రాజధాని రాంచీలో బుధవారం రాత్రి జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, రాంచీలోని ధుర్వ రింగ్ రోడ్డులో కొందరు వ్యక్తులు ఓ బాలికను బలవంతంగా కిడ్నాప్ చేశారు. రతు పోలీస్ స్టేషన్ పరిధిలో దలదాలి ప్రాంతంలోని రెస్టారెంట్ వద్ద పార్కు చేసిన ఈ కారును పోలీసులు అనుమానంతో తనిఖీ చేయగా, ఈ సామూహిక అత్యాచార ఘటన వెలుగుచూసింది. 
 
ఆ కారులో మొత్తం ఐదుగురు వ్యక్తులు ఉండగా, బాలిక ఒక్కటే బోరున ఏడుస్తూ కనిపించింది. దీంతో బాలికను అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం వెల్లడించడంతో కారులోని ఐదుగురు వ్యక్తులను అరెస్టు చేశారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ జరుపుతున్నారు. బాలికకు వైద్య పరీక్షలు చేసిన తర్వాత తల్లిదండ్రులకు అప్పగించారు.