గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 12 మే 2022 (11:06 IST)

సీఎం జగన్ సొంత జిల్లాలో దళిత బాలికపై కామాంధుల సామూహిక అత్యాచారం..

rape
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సొంత జిల్లా వైఎస్ఆర్ కడప జిల్లాలోని ప్రొద్దుటూరులో ఓ దళిత బాలికపై పది మంది కామాంధులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. దీంతో ఆ బాలిక గర్భందాల్చింది. ఈ విషయంపై స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ పోలీసులు మాత్రం నిందితులను తప్పించేందుకు కుంటి సాకులు చెబుతూ కేసు నమోదు  చేసేందుకు  మీనమేషాలు లెక్కిస్తున్నారు. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, ప్రొద్దుటూరులోని ఓ కాలనీ చెందిన దళిత బాలిక గర్భంతో ఉండటాన్ని ఇరుగుపొరుగువారు గుర్తించి మహిళా పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో వారు వచ్చి ఆ బాలిక వద్దకు వచ్చి విచారించారు. ఈ విచారణలో శివాలయం సమీపంలోని పాడైన మార్కెట్ వద్ద నుంచి చెంబు అనే వ్యక్తి తనను ఆటోలో తీసుకెళ్లి మరో తొమ్మిది మందితో కలిసి పలుమార్లు అత్యాచారం చేసినట్టు చెప్పింది. 
 
ఈ విషయాన్ని సీఐ నాగరాజుకు మహిళా పోలీసులు చెప్పారు. దీనిపై తక్షణం స్పందించాల్సిన సీఐ నాగరాజు.. విచారణ పేరుతో కాలయాపన చేస్తూ కుంటి సాకులు చెబుతున్నారు. అంతేకాకుండా, నిందితులను తప్పించేందుకు వీలుగా ఆయన బాలికకు అబార్షన్ చేయించేందుకు ఓ ప్రైవేట్ హోంకు తరలించారు.