శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By సెల్వి
Last Updated : బుధవారం, 11 మే 2022 (13:08 IST)

ప్రేయసి కోసం కరెంట్‌ను కట్ చేశాడు.. గ్రామస్థులు రెడ్ హ్యాండెడ్‌గా ...

ప్రేమ కోసం.. ప్రేయసిని కలవడం కోసం కరెంట్‌ను కట్ చేసేవాడు. ఆమె కోసం గ్రామం మొత్తం పవర్ కట్ చేసేవాడు. ఇదంతా గమనించిన గ్రామస్థులు ఏం చేశారంటే..? చీకటి ముసుగులో తన ప్రేయసిని కలవడానికి గ్రామంలో విద్యుత్ సరఫరాను నిలిపివేసిన ఒక ఎలక్ట్రీషియన్‌ను బీహార్ గ్రామస్థులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. 
 
వివరాల్లోకి వెళితే.. తూర్పు బీహార్‌లోని పూర్ణియా జిల్లాలోని గణేష్ పూర్ గ్రామ ప్రజలు సాయంత్రం ఒక నిర్దిష్ట సమయంలో రెండు నుండి మూడు గంటల పాటు తరచుగా విద్యుత్ కోతలను చూడటం ప్రారంభించారు. 
 
నిర్ధిష్ట సమయం మాత్రమే కరెంట్ పోవడం.. పొరుగు గ్రామాల్లో కరెంట్ వుండటం చూసిన గ్రామస్థులు కారణాన్ని కనుగొనే పనిలో పడ్డారు. ఆ సమయంలో ఎలక్ట్రీషియన్ చీకటిలో తన ప్రేయసిని కలవడానికి గ్రామంలో విద్యుత్ సరఫరాను నిలిపివేస్తున్నట్లు గ్రామస్థులకు తెలిసింది. 
 
ఈ సంఘటనను మరింత రుజువు చేయడానికి, గ్రామస్థులు నిందితుడిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకోవటానికి పక్కా ప్లాన్ వేశారు. మరుసటిసారి గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో, గ్రామస్థులు గుమిగూడి స్థానిక ప్రభుత్వ పాఠశాలకు చేరుకున్నారు, అక్కడ వారు జంటను పట్టుకున్నారు.
 
ఎలక్ట్రీషియన్ చేసిన పనికి ముందుగా గ్రామస్థులు అతనిని చితక్కొట్టారని.. ఆపై శిక్షగా వీధుల్లో ఊరేగించారని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. తన ప్రేయసిని కలవాలని అనుకున్నప్పుడల్లా విద్యుత్ సరఫరాను నిలిపివేస్తానని ఆ వ్యక్తి గ్రామస్తులకు చెప్పాడు. 
 
అంతేగాకుండా సర్పంచ్, ఇతర గ్రామ కౌన్సిల్ సభ్యుల సమక్షంలో ఆ వ్యక్తి బాలికను వివాహం చేసుకున్నాడని గ్రామస్థులు తెలిపారు. ఈ ఘటనపై ఇప్పటివరకు తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు. 
 
ఈ ఘటనపై ఫిర్యాదు అందిన తర్వాత చర్యలు తీసుకుంటామని స్థానిక పోలీస్ స్టేషన్ ఇన్ఛార్జ్ వికాస్ కుమార్ ఆజాద్ తెలిపారు.