1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By జె
Last Modified: గురువారం, 28 అక్టోబరు 2021 (17:26 IST)

బిల్డింగ్ పనిచేస్తూ మహిళ స్నానం చేస్తుండటాన్ని సెల్ ఫోన్‌లో తీసి...?

బెజవాడలో కామాంధుని బాగోతం బయటపడింది. కొత్తపేటలో ఒక మహిళ స్నానం చేస్తుండగా ఒక యువకుడు సెల్ ఫోన్లో చిత్రీకరించాడు. సుమారు 10 నిమిషాల పాటు మొత్తం వీడియోను తన సెల్ ఫోన్లో బంధించాడు. అక్కడితో ఆగలేదు, ఆ వీడియోను స్నేహితులకు చూపిస్తూ కూర్చున్నాడు. అడ్డంగా దొరికిపోయాడు.
 
కొత్తపేటలో నివాసముంటున్న ఒక వివాహిత తన ఇంటిలోని బాత్రూంకు వెళ్ళి స్నానం చేస్తోంది. పక్కనే బిల్డింగ్ పనులు చేస్తున్న బీహార్‌కు చెందిన ఒక యువకుడు ఆమె స్నానం చేయడాన్ని గమనించాడు. తనతో పాటు పనిచేసే వారు లేకపోవడంతో ఆంటీని స్నానం చేయడాన్ని సెల్ ఫోన్లో చిత్రీకరించాడు.
 
సుమారు 10 నిమిషాల నిడివిగల వీడియోను చిత్రీకరించడమే కాకుండా తనతో పాటు ఉన్న బీహార్ స్నేహితులకు వీడియోలను చూపించాడు. అక్కడ పనిచేస్తున్న స్థానిక మహిళలు గుర్తించి మేస్త్రీకి సమాచారమిచ్చారు. అతని సమాచారంతో పోలీసులు రంగంలోకి దిగారు. యువకుడిని అదుపులోకి తీసుకున్నారు.