శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 28 అక్టోబరు 2021 (11:29 IST)

కరిచిన పాముతో ఆస్పత్రికి చికిత్సకు వచ్చిన మహిళ

సాధారణంగా విష సర్పాలంటే భయపడి ఆమడదూరం పారిపోతాం. కానీ, ఓ మహిళ ఓ విష సర్పంతో ఆస్పత్రికి వచ్చింది. ఇంతకీ ఆ పాపు చేసిన తప్పేంటంటే.. ఆ మహిళను కాటేయడమే. తనను కాటేసిన పామును చేతపట్టుకుని ఆ మహిళ ఆస్పత్రికి వచ్చింది. ఈ ఘటన కర్నాటక రాష్ట్రంలో జరిగింది.
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, కర్ణాటకలోని డెంకణీ కోట గ్రామానికి చెందిన మణి అనే మహిళకు సంచన శ్రీ అనే కుమార్తె వుంది. సంచన శ్రీ ఇంటి ముందు ఆడుకుంటుండగా కట్లపాము జాతికి చెందిన ఓ చిన్న పాము కాటేసింది. 
 
చిన్నారి కేకలు వేయడంతో స్థానికులు.. పామును కొట్టి
సంచిలో వేశారు. తర్వాత చిన్నారిని డెంకణీ కోట ప్రభుత్వ తీసుకెళ్లగా.. సంచిలో నుండి పామును కూడా తీసి చూపించడంతో వైద్యులు సైతం భయపడ్డారు. ఆ తర్వాత చిన్నారికి వైద్యులు చికిత్స చేయడంతో ప్రాణాలు నిలిచాయి.