1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By జె
Last Modified: మంగళవారం, 8 ఫిబ్రవరి 2022 (18:07 IST)

స్నేహితుడే కదా అని చేరదీస్తే ప్రియురాలిని లొంగదీసుకున్నాడు, ఆ తర్వాత?

ఆమెకు పెళ్ళి కాలేదు. తండ్రి అనారోగ్యంతో చనిపోయాడు. తల్లి తన మాట వింటుందన్న నమ్మకం. అందుకే తనతో పాటు పనిచేసే కొలీగ్‌కు దగ్గరైంది. అతనితో ఇంట్లోనే సహజీవనం పెట్టేసింది. సుమారు 3 యేళ్ల పాటు సహజీవనం సాగింది. ఇంతలో తన ప్రియుడి స్నేహితుడు పరిచయమయ్యాడు. అతను ఆమెని మభ్యపెట్టి లొంగదీసుకున్నాడు.

 
ముంబైలోని విలేపార్లేలో నివాసముంటుంటోంది కేథరిన్. ప్రముఖ కాల్ సెంటర్లో ఆమె పనిచేస్తోంది. కాల్ సెంటర్లో పనిచేస్తోన్న కరోల్ మిస్కిట్టా అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త స్నేహంగా మారింది. ఆ స్నేహం కాస్త సహజీవనం వరకు వెళ్ళింది. తండ్రి అప్పటికే అనారోగ్యంతో చనిపోవడంతో కేథరిన్ ఆడిందే ఆట..పాడిందే పాటలా తయారైంది.

 
దీంతో కొన్ని సంవత్సరాల పాటు కరోల్ మిస్కిట్టాతో సహజీవనం చేసింది. పెళ్ళి కాకుండానే కలిసి ఉంది. కాల్ సెంటర్‌కు ఒక కొత్త యువకుడు వచ్చాడు. అతను కరోల్ స్నేహితుడు. అతని ద్వారా కేథరిన్‌కు దగ్గరయ్యాడు సంజయ్. ఆమెకి మాయ మాయటలు చెప్పి, మభ్యపెట్టి లొంగదీసుకున్నాడు.

 
మొదటి ప్రియుడికి తెలిస్తే ఇబ్బందులు ఎదుర్కొంటామని విషయం చెప్పకుండా దాచింది. పనిచేస్తున్న కొలిగ్స్ ఇచ్చిన సమాచారంతో కేథరిన్‌ను నిలదీసాడు ప్రియుడు. మాటా మాట పెరిగి కేథరిన్‌ను హత్య చేశాడు. ఆ తర్వాత ఆమెది ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేశాడు.

 
రెండవ ప్రియుడు ఫిర్యాదుతో పోలీసులు విచారణ జరిపి హత్యగా నిర్థారించుకుని కరోల్‌ను అదుపులోకి తీసుకున్నారు. కేథరిన్ హత్యతో ఆమె తల్లి ఒంటరిగా మిగిలిపోయింది. వృధ్యాప్యం పైబడడంతో ఆమెను ఆదుకునే వారే లేకుండా పోయారు.