ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By ఐవీఆర్
Last Updated : మంగళవారం, 8 అక్టోబరు 2024 (22:59 IST)

ప్రియుడి కోసం గోధుమ పిండిలో విషం కలిపి 13 మందిని చంపేసింది

poison
ప్రియుడు కోసం ప్రియురాలు దారుణానికి ఒడిగట్టింది. తన ప్రియుడికి ఇచ్చి పెళ్లి చేసేందుకు పెద్దలు అడ్డుపడుతున్నారని తన సొంత కుటుంబ సభ్యులను పొట్టనబెట్టుకుంది. ఈ దారుణ ఘటన పాకిస్తాన్ దేశంలోని సింధు ప్రావిన్స్‌లో ఆలస్యంగా వెలుగుచూసింది. పూర్తి వివరాలు ఇలా వున్నాయి.
 
హైబత్ ఖాన్ బోహ్రి అనే గ్రామానికి చెందిన ఓ బాలిక గత కొంతకాలంగా ఓ యువకుడిని ప్రేమిస్తోంది. ఈ విషయం తెలిసిన పెద్దలు ఆమెను తీవ్రంగా మందలించారు. దీనితో కుటుంబం పైన పగ పెంచుకోవడమే కాకుండా తన ప్రియుడికిచ్చి పెళ్లి చేయడంలేదని వారిని మట్టుబట్టేందుకు ప్లాన్ వేసింది. ప్రియుడుతో కలిసి ఆ పనిని చేసింది.
 
గోధుమ పిండిలో విషం కలిపి చపాతీలుగా చేసి వాటిని కుటుంబ సభ్యులందరికీ వడ్డించింది. వాటిని తిన్న 13 మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీనితో వారందరినీ సమీపంలోని ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ అందరూ మరణించారు. ఈ దారుణానికి పాల్పడిన బాలికను అదుపులోకి తీసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.