శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By ఐవీఆర్
Last Modified: బుధవారం, 3 నవంబరు 2021 (18:33 IST)

బాత్రూం బాగు చేయమంటే సీక్రెట్ కెమేరా పెట్టి వెళ్లాడు...

కామాంధులు అనేక దారుల్లో మహిళలపై వేధింపులకు పాల్పడుతున్నారు. ప్లంబరుగా పనిచేస్తున్న 57 ఏళ్ల వృద్ధుడు బాత్రూం బాగుచేయమంటే, రిపేర్ చేసినట్లే చేసి గదిలో సీక్రెట్ కెమేరా అమర్చి వెళ్లాడు.

 
పూర్తి వివరాలలోకి వెళితే... బ్రిటన్ దేశంలో ఓ మహిళ తన బాత్రూంలో పంపు సమస్య వచ్చిందని ప్లంబరును సంప్రదించింది. అతడు ఇంటికి వచ్చి బాత్రూం బాగుచేసినట్లే చేసి ఆ గదిలో ఓ మూలన సీక్రెట్ కెమేరా పెట్టి వెళ్లిపోయాడు. అప్పటి నుంచి బాత్రూంలో ఆమె కదలికలను గమనిస్తున్నాడు.

 
చాలారోజుల తర్వాత మహిళకు అనుమానం వచ్చింది. గదిలో ఏదో చిన్ని కెమేరా మాదిరిగా వస్తువు కనిపించడంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. దర్యాప్తు చేసిన పోలీసులు అది ప్లంబర్ పనిగా తేల్చారు. గతంలోనూ అతడు ఇలాంటి ఘటలను పాల్పడినట్లు తేలింది.