కాకినాడ రూరల్ బోట్ క్లబ్‌లో శవం... హత్యా? ఆత్మహత్యా?
తూర్పు గోదావరి జిల్లా కాకినాడ రూరల్ బోట్ క్లబ్ లో గుర్తు తెలియని యువకుడి మృత దేహం కలకలం రేపుతోంది. ఆ యువకుడు బోట్ క్లబ్ కొలనులో దిగి ఆత్మహత్య చేసుకున్నాడా? లేక ఎవరైనా హత్య చేసి, యువకుడి శవాన్ని ఇక్కడ పడేశారనేది అనుమానాస్పదంగా ఉంది. సంఘటన స్థలానికి చేరుకొని విచారణ చేపట్టిన సర్పవరం పోలీసులు ఈ కేసు కూపీ లాగుతున్నారు.
మృతి చెందిన యువకుడు ఎ.సూర్యశ్రీ పణి ప్రశాంత్ అని, అతని వయసు కేవలం 15 సంవత్సరాలుగా ప్రాథమికంగా గుర్తించారు. రెండు రోజులు క్రితం సర్పవరం పోలీస్ స్టేషన్ లో సూర్యశ్రీ పణి ప్రశాంత్ అనే యువకుడు కనిపించడం లేదు అని పిర్యాదు అందింది. తమ కుమారుడు కనిపించడం లేదని యువకుడి తల్లితండ్రులు పోలీసులను ఆశ్రయించారు. అయితే, ఇది హత్య లేక ఆత్మహత్య అనే కోణం లో విచారణ చేపట్టిన సర్పవరం పోలీసులు అనుమానితులను ప్రశ్నిస్తున్నారు.