శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 18 అక్టోబరు 2021 (12:28 IST)

సూర‌త్‌ మాస్కుల కంపెనీలో అగ్నిప్ర‌మాదం: ఒకరు మృతి

గుజ‌రాత్‌లో పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన సూర‌త్‌లో అగ్నిప్ర‌మాదం సంభ‌వించింది. మాస్కులు త‌యారు చేసే ప‌రిశ్ర‌మ‌లో ఉద‌యం పెద్ద ఎత్తున మంట‌లు చెల‌రేగాయి. ఈ అగ్నిప్ర‌మాదంలో ఒక‌రు మృతి చెందారు. ప్ర‌మాదం జ‌రిగిన స‌మ‌యంలో ప‌రిశ్ర‌మ‌లో 200 మంది కార్మికులు ప‌నిచేస్తున్నారు. 
 
అగ్నిప్ర‌మాదం సంభ‌వించిన వెంట‌నే అగ్నిమాప‌క సిబ్బంది ఘ‌ట‌నా స్థలానికి చేరుకొని మంట‌లు ఆర్పే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. ప‌రిశ్ర‌మ‌లో చిక్కుకున్న కార్మికుల‌ను సుర‌క్షితంగా బ‌య‌ట‌కు తీసుకొచ్చేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారు. పరిశ్ర‌మ‌లో అగ్నిప్ర‌మాదానికి గల కార‌ణాలు తెలియాల్సి ఉంది.