గురువారం, 10 అక్టోబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Modified: విజ‌య‌వాడ‌ , సోమవారం, 18 అక్టోబరు 2021 (12:51 IST)

రూల్ ఆఫ్ రిజర్వేషన్ ను పక్కాగా అమలు చేయాలి: బిసి క‌మిష‌న్

రూల్ ఆఫ్ రిజర్వేషన్ ను పక్కాగా అమలు చేయాలని రాష్ట్ర బి.సి కమిషన్ ఛైర్మన్ జస్టిస్ ఎ. శంకర్ నారాయణ పేర్కొన్నారు. సోమవారం ఉదయం  తిరుపతి  శ్రీ పద్మావతి అతిథి గృహంలో ఛైర్మన్  కమిటీ  సభ్యులు అయిన మరప్పగారి కృష్ణప్ప, వెంకట సత్య దివాకర్ పక్కి , అవ్వరు  ముసలయ్య, కార్యదర్శి డి. చంద్ర శేఖర్ రాజులతో కలసి రూల్ ఆఫ్ రిజర్వేషన్ అమలుపై జిల్లా కలెక్టర్ యం. హరినారాయణన్, ఇతర సంబంధిత అధికారులతో  సమీక్షా నిర్వహించారు.      
 
ఈ సందర్బంగా జిల్లాలో బి.సి లకు అమలు అవుతున్నపథకాలు, వివిధ ప్రభుత్వ శాఖల లో రూల్ ఆఫ్ రిజర్వేషన్, రోస్టర్ పాయింట్ లకు సంబంధించి కమిటీ సమీక్షా నిర్వహించారు. జిల్లాలో రూల్ ఆఫ్ రిజర్వేషన్ ను కచ్చితంగా అమలు చేస్తున్నామ‌ని, రాష్ట్ర ప్రభుత్వం నవరత్నాలు ద్వారా సంక్షేమ పథకాలు అమలు చేస్తోంద‌ని, ప్రధానంగా 45-60 సంవత్సరాలు మధ్య గల మహిళలకు వై.ఎస్.ఆర్ చేయూత పథకం, జగనన్న తోడు అందిస్తున్నామ‌న్నారు. స్వయం సహాయక సంఘాలలోని మహిళలు  వై.ఎస్.ఆర్ ఆసరా పథకాల ద్వారా లబ్ది పొందుతున్నారని జిల్లా కలెక్టర్  యం. హరినారాయణన్ కమిటీకి వివరించారు. 
 
ఈ కార్యక్రమంలో భాగంగా ఛైర్మన్ ను, కమిటీ సభ్యుల‌ను జిల్లా కలెక్టర్, జిల్లా జాయింట్ కలెక్టర్ శాలువాతో సత్కరించి, శ్రీ వేంకటేశ్వర స్వామి వారి చిత్ర పటాన్ని, డైరీని అందజేశారు. సమీక్షా సమావేశానికి ముందుగా  పద్మావతి అతిధి గృహంలో జిల్లా కలెక్టర్ బి సి కమిషన్ ఛైర్మన్ ను మర్యాదపూర్వకంగా కలిశారు.
 
ఈ సమీక్షా సమావేశంలో జిల్లా జాయింట్ కలెక్టర్ ( ఆసరా) రాజశేఖర్, తిరుపతి  అదనపు ఎస్. పి సుప్రజ, జిల్లా బి సి వెల్ఫర్ అధికారి కుష్భు కోటారి, డి.ఇ. ఓ పురుషోత్తమ్, డి ఏం అండ్ హెచ్ ఓ డాక్టర్ శ్రీ హరి,  డ్వామా  పి.డి చంద్ర శేఖర్, పి ఆర్, ఆర్ అండ్ బి, ఆర్ డబ్ల్యూ ఎస్, ట్రాన్స్కో, ఎస్. సి. లు అమరనాథ్ రెడ్డి, దేవనందం, విజయ కుమార్, చలపతి, హౌసింగ్ పి.డి పద్భనాభం, పశు సంవర్థక శాఖ జి డి వెంకట రావు, డి.పి.ఓ దశరధ రామి రెడ్డి, జెడ్‌పి.సి.ఇ.ఓ ప్రభాకర్ రెడ్డి, సమగ్ర శిక్ష ఏ టి సి వెంకట రమణ రెడ్డి, హర్టీకల్చర్ డి.డి శ్రీనివాస్ రావు, వివిధ సంబంధిత శాఖల జిల్లా ఉన్నతాధికారులు పాల్గొన్నారు.