గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By ఠాగూర్

కరోనా మాత్రలని మత్తు మాత్రలు ఇచ్చి బాలికపై హాస్టల్ కరస్పాండెంట్ అత్యాచారం

rape
రెండు తెలుగు రాష్ట్రాల్లో వరుసగా అత్యాచార ఘటనలు జరుగుతున్నాయి. ఇలాంటి అత్యాచారాలు పునరావృత్తం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలంటూ పాలకలు చేసే ప్రకటలు ఉత్తుత్తివిగానే మిగిలిపోతున్నాయి. అందుకే హైదరాబాద్ నగరంలో మైనర్ బాలికపై జరిగిన అత్యాచార ఘటన దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. 
 
ఈ విషయం మరచిపోకముందే ఏపీలోని కాకినాడ జిల్లాలో మరో బాలిక అత్యాచారానికి గురైంది. కరోనా మాత్రలని నమ్మించి మత్తు మాత్రలు ఇచ్చిన ఓ కామాంధ కరస్పాండెంట్ బాలికపై అత్యాచారానికి తెగబడ్డాడు. బాధిత బాలిక వసతి గృహంలో ఉంటూ చదువుకుంటుంది. 
 
ఒకసారి అత్యాచారం చేసి ఆ తర్వాత మాయమాటలు చెప్పి పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. అయితే, మూడు రోజులుగా రక్తస్రావం కావడంతో తల్లి ఆరా తీసింది. దీంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఈ కేసు వివరాలను పరిశీలిస్తే, 
 
కాకినాడ పట్టణానికి చెందిన ఆరో తరగతి చదువుతున్న బాలిక కొండయ్య పాళెలోని హెల్పింగ్ హ్యాండ్స్ ప్రైవేటు వసతి గృహంలో ఉంటూ చదువుకుంటుంది. తండ్రి చనిపోవడంతో తల్లే ఆమెను చదివిస్తుంది. ఇటీవలే తొమ్మిదో తరగతి పరీక్షలు రాసిన ఆ బాలికపై వసతి గృహ కరస్పాండెంట్ కొత్తపల్లి విజయకుమార్ (60) కన్నుపడింది. 
 
ఈ క్రమంలో గత ఏప్రిల్ నెలలో ఆ బాలికకు మాయమాటలు చెప్పిన తన గదికి తీసుకెళ్లాడు. అక్కడ కరోనా మాత్రలంటూ బాలికకు కొన్ని మత్తు మాత్రలు ఇచ్చాడు. వాటిని మింగగానే ఆ బాలిక మత్తులోకి జారుకుంది. ఆ తర్వాత కామాంధుడు ఆ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. 
 
ఇక అప్పటి నుంచి పలుమార్లు మాయమాటలు చెబుతూ, ఆశ చూపుతూ అత్యాచారం చేస్తూ వచ్చాడు. ఈ క్రమంలో ఇపుడు వేసవి సెలవులు కావడంతో ఆ బాలిక ఇంటిపట్టునే ఉంటుంది. అయితే, గత మూడు రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ, నీరసించి పోవడంతో పాటు తీవ్రమైన రక్తస్రావం కావడంతో ఆందోళనపడిన తల్లి వైద్యుడు వద్దకు తీసుకెళ్లగా అసలు విషయం వెల్లడైంది. 
 
ఆ యువతి గర్భస్రావమైనట్టు వైద్యులు చెప్పారు. ప్రస్తుతం ఆ బాలికను కాకినాడ జీజీహెచ్‌లో చేర్చి చికిత్స అందిస్తున్నారు. బాధితురాలి తల్లి ఫిర్యాదు మేరకు విజయకుమార్‌పై కేసు నమోదు చేసిన పోలీసులు కేసు నిందితుడిని అరెస్టు చేశారు. కామాంధుడుపై ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు.