మంగళవారం, 7 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By వరుణ్
Last Updated : మంగళవారం, 30 జనవరి 2024 (12:10 IST)

హైదరాబాద్‌ నార్సింగ్‌లో డ్రగ్ కలకలం.. ఆ హీరో ప్రియురాలు అరెస్టంటూ వార్తలు...

drugs
హైదరబాద్ నగరంలో మరోమారు డ్రగ్ కలకలం చెలరేగింది. స్థానిక నార్సింగి‌లో ఓ యువతి డ్రగ్‌తో పట్టుబడింది. ఈమె నుంచి 4 గ్రాముల మత్తుపదార్థాన్ని స్వాధీనం చేసుకుంది. పేరు లావణ్య. ఈమెకు చిత్రపరిశ్రమకు చెందిన అనేక మంది వ్యక్తులతో పరిచయం ఉంది. పైగా, ఈమె ఓ హీరో ప్రియురాలు అంటూ సోషల్ మీడియాలో వార్తా కథనాలు ప్రసారం చేశారు. దీనికి కారణం లేదు. 
 
నార్సింగి‌లో డ్రగ్స్‌కు సంబంధించిన పక్కా సమాచారం. దాడులు జరిపిన పోలీసులు.. లావణ్యను అదుపులోకి తీసుకున్నారు. ఆమె ఓ టాలీవుడ్ హీరో ప్రియురాలు అంటూ ప్రచారం జరిగింది. లావణ్యపై పోలీసుల ఎన్టీపీసీ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. ఆమెకు చిత్రపరిశ్రమకు చెందిన అనేక మందితో పరిచయాలు ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. ఇప్పటికే ఆమెపై మోకిల పోలీస్ స్టేషన్‌లో ఓ డ్రగ్స్ కేసు నమోదైవుంది. ఆమె గోవా నుంచి డ్రగ్స్ తీసుకొచ్చి హైదరాబాద్‌‍ నగరంలోని పలువురు సినీ రాజకీయ ప్రముఖులకు సరఫరా చేస్తున్నట్టు పోలీసుల ప్రాథమిక విచారణలో వెల్లడైంది.