మంగళవారం, 7 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By ఐవీఆర్
Last Modified: శుక్రవారం, 26 ఏప్రియల్ 2024 (14:16 IST)

మహిళతో సన్నిహిత సంబంధం: యువకుడి జననేంద్రియాలపై మోకాలితో గుద్ది హత్య

crime
తెలంగాణలోని ముదిగొండలో దారుణ హత్య జరిగింది. తనకు సన్నిహితంగా వున్న మహిళతో స్నేహం చేస్తున్నాడని, ఆమెను లొంగదీసుకునే ప్రయత్నం చేస్తున్నాడని అనుమానించి సదరు యువకుడిని హత్య చేసారు. అతడి జననేంద్రియాలపై మోకాలితో గట్టిగా గుద్దుతూ హతమార్చినట్లు అనుమానిస్తున్నారు.
 
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... ముదిగొండ పరిధిలోని గంధసిరి గ్రామానికి చెందిన 26 ఏళ్ల షేక్ షరీఫ్ హైదరాబాదులో ఉద్యోగం చేసుకుంటున్నాడు. రెండురోజుల క్రితం గ్రామానికి వచ్చాడు. ఈ నేపధ్యంలో ఇద్దరు యువకులు అతడితో ఓ మహిళ విషయమై గొడవపడ్డారు. ఈ గొడవ పెద్దదై షరీఫ్ పైన దాడికి దిగారు. అతడిని కింద పడేసి జననేంద్రియాలపై మోకాలితో గట్టిగా గుద్దుతూ హత్య చేసినట్లు స్థానికులు తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.