సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By వరుణ్
Last Updated : మంగళవారం, 21 ఫిబ్రవరి 2023 (16:50 IST)

ప్రిన్సిపాల్‌పై పెట్రోల్ పోసి నిప్పంటించిన కాలేజీ పూర్వవిద్యార్థి

crime
మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఇండోర్‌లో దారుణం జరిగింది. తన మార్కుల జాబితా ఇవ్వలేదన్న కోపంతో కాలేజీ ప్రిన్సిపాల్‌పై ఓ పూర్వ విద్యార్థి పెట్రోల్ పోసి నిప్పంటించాడు. దీంతో తీవ్రంగా గాయపడిన ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలిను పరిశీలిస్తే.. 
 
ఇండోర్ జిల్లా సిమ్రోల్‌లోని బీఎంబీ ఫార్మసీ కాలేజీ ప్రిన్సిపాల్‌గా విముక్త శర్మ (54) సోమవారం కళాశాల ముగిసిన తర్వాత ఆవరణలో బిల్వపత్రి ఆకులను తెంపుతూ కనిపించింది. అదే కాలేజీలో గత యేడాది చదువుకున్న ఓ అశుతోష్ శ్రీవాత్సవ (24) అనే విద్యార్థి పెట్రోల్ బాటిల్ నిప్పంటించాడు. 
 
దీంతో 80 శాతం శరీరం కాలిపోయి తీవ్ర గాయాలపాలైన ఆమెను ఆస్పత్రికి తరలించారు. ఆమె పరిస్థితి విషమంగా ఉంది. కాగా శ్రీవాత్సవ గత సంవత్సరమే చదువు పూర్తిచేసుకున్నా తన మార్క్‌షీట్‌ ఇంకా ఇవ్వకపోవడంతోనే అతడు ఈ ఘాతుకానికి పాల్పడినట్లు తెలిసింది.