ఆదివారం, 3 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 21 ఫిబ్రవరి 2023 (23:40 IST)

50 అడుగుల ఎత్తుకు ఎగిరిన జల్లికట్టు బసవన్న.. వీడియో వైరల్ (video)

Jallikattu
జల్లికట్టు బసవన్నల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అవి సాహసానికి పెట్టింది పేరు. జల్లికట్టులో పాల్గొనే బసవన్నలను తమిళనాట చాలా శ్రద్ధ తీసుకుంటారు. వాటిని బలంగా, సాహసంగా పెంచుతారు. తాజాగా పుదుకోట్టైలో జల్లికట్టు పోటీలో 50 అడుగుల ఎత్తులో ఎగురుతున్న దృశ్యం వైరల్‌గా మారింది.
 
 

 
పుదుకోట్టై జిల్లా విరాలిమలై సమీపంలోని ఆలందూరులో జల్లికట్టు పోటీలు జరుగుతున్నాయి. ఈ పోటీలో 700కు పైగా బసవన్నలు పాల్గొనగా.. 211 మంది గోరక్షకులు పాల్గొని ఎద్దులను పట్టుకున్నారు. ఈ మ్యాచ్‌లను తిలకించేందుకు పెద్ద సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు. 
 
ఈ మ్యాచ్‌లో ఓ బసవన్న ఆటగాళ్ల చేతికి చిక్కకుండా మైదానం వీడింది. అక్కడి నుంచి ప్రజలుండే ప్రాంతంలోకి వ్యాపించడంతో తీవ్ర కలకలం రేగింది.
 
ఎవరినీ  గాయపరచని ఆ బసవన్న ఇసుక దిబ్బపైకి ఎక్కి అటువైపు దూకింది. దాదాపు 50 అడుగుల ఎత్తులో ఎద్దు ఎగురుతున్న దృశ్యం చూపరులను నివ్వెరపరిచింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.