శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఐవీఆర్
Last Modified: శనివారం, 28 జనవరి 2023 (16:48 IST)

ఇంకా విషమంగానే తారకరత్న ఆరోగ్యం, హెల్త్ బులిటెన్ విడుదల

Tarakaratna
కర్టెసి-ట్విట్టర్
నటుడు తారకరత్న ఆరోగ్య పరిస్థితి ఇంకా విషమంగానే వున్నట్లు బెంగళూరు నారాయణ వైద్యాలయం హెల్త్ బులిటెన్ ద్వారా తెలుస్తోంది. ఆయనకు ప్రత్యేక వైద్య బృందం చికిత్స అందిస్తున్నట్లు అందులో పేర్కొన్నారు. తారకరత్న ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు. ఆయనకు మరికొన్నిరోజుల పాటు చికిత్స అవసరమవుతుందని అందులో పేర్కొన్నారు.
 
Bulletin
టీడీపీ యువనేత నారా లోకేష్ 'యువగళం' పాదయాత్రలో పాల్గొని గుండెపోటుకు గురైన సినీనటుడు తారకరత్నను శుక్రవారం అర్థరాత్రి ప్రత్యేక అంబులెన్స్‌ ద్వారా బెంగళూరులోని నారాయణ ఆసుపత్రికి తరలించారు. అతని భార్య అలేఖ్యారెడ్డి- కుమార్తెలు ఆసుపత్రికి చేరుకున్నారు.  
 
ప్రస్తుతం బెంగళూరు ఆసుపత్రిలో వైద్య నిపుణుల సంరక్షణలో తారకరత్న వున్నారు. శుక్రవారం నారా లోకేష్ యువగళం పాదయాత్రలో తారకరత్నకు గుండెపోటు రావడంతో వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించిన సంగతి తెలిసిందే.