సోమవారం, 18 నవంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : మంగళవారం, 27 డిశెంబరు 2022 (16:36 IST)

ఎస్ 5 నో ఎగ్జిట్ విడుదలకు ముందే భారీ ఆఫర్ : భరత్ కోమలపాటి, గౌతమ్ కొండెపూడి

Bharat Komalapati, Gautham Kondepudi
Bharat Komalapati, Gautham Kondepudi
తారకరత్న, ప్రిన్స్, సునీల్, అలీ, సాయి కుమార్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా ఎస్ 5 నో ఎగ్జిట్. భరత్ కోమలపాటి (సన్నీ కోమలపాటి) ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. శౌరీ ఎంటర్ టైన్ మెంట్స్ పతాకంపై ఆదూరి ప్రతాప్ రెడ్డి, దేవు శామ్యూల్, షైక్ రెహీమ్, మెల్కి రెడ్డి గాదె, గౌతమ్ కొండెపూడి నిర్మిస్తున్నారు. హర్రర్ థ్రిల్లర్ సినిమా గా తెరకెక్కిన ఈ సినిమా ఈ నెల 30 న థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా చిత్ర విశేషాలు తెలిపారు దర్శక నిర్మాతలు భరత్ కోమలపాటి, నిర్మాత గౌతమ్ కొండెపూడి
 
దర్శకుడు భరత్ కోమలపాటి మాట్లాడుతూ....నేను 2004లో హీరో కావాలనే ఆలోచన ఉండేది. ఆ తర్వాత ఓ కార్యక్రమంలో నేను చేసిన డాన్సులు చూసి బాగా డాన్సులు చేస్తున్నావు అని మిత్రులు ఎంకరేజ్ చేశారు. పూరి జగన్నాథ్ జ్యోతిలక్ష్మిలో ఓ పాట చేసే అవకాశం ఇచ్చారు. ఇలా కొరియోగ్రాఫర్ గా కొనసాగుతున్నా. నాకు డైరెక్షన్ మీద ప్యాషన్ ఉండేది. ఖాలీగా ఉన్నప్పుడు రకరకాల కాన్సెప్ట్స్, కథలు రాసేవాడిని. అలా రాసుకున్న కథే ఎస్ 5 నో ఎగ్జిట్. హైదరాబాద్ నుంచి విశాఖ వెళ్లే ఒక ట్రైన్ లో ఒక కోచ్ మొత్తం మంటలు అంటుకుంటాయి. ఆ ఒక్క బోగికే ఎందుకు అగ్నిప్రమాదం జరిగింది అనేది ఆసక్తికరంగా ఉంటుంది. 
 
సుబ్బు అనే పాత్రను తారకరత్న పోషించారు. ఆయన సీఎం సాయి కుమార్ కొడుకు. తన పుట్టినరోజు సెలబ్రేట్ చేసుకునేందుకు ఓ కోచ్ ను బుక్ చేసుకుంటారు. ఇందులోని వారంతా బోగిని అలంకరించుకుని పార్టీ చేసుకుంటారు. అప్పుడు సడెన్ గా కోచ్ డోర్స్ క్లోజ్ అవుతాయి. నో ఎగ్జిట్ అన్నమాట. ఆ తర్వాత అగ్నిప్రమాదం జరుగుతుంది. అసలా అగ్నిప్రమాదం ఎందుకు జరిగింది, ఎలా జరిగింది, ఆ తర్వాత ఏమైందనేది చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి. కథనం ఊహకందదు. ఇందులో పొలిటికల్ డ్రామా కూడా చూపిస్తున్నాం. తారకరత్న 45 డేస్ ఈ సినిమా కోసం కష్టపడ్డారు. ఆయన ఎక్కువగా మాట్లాడకుండా తండ్రి చెప్పిన మాట ప్రకారం నడుచుకునే వ్యక్తి. నాన్న చెప్పిందే చేస్తా నాకేం తెలియదు అన్నట్లు ఉంటాడు. అలాగే టీసీ పాత్రలో అలీ గారు, మరో కీ రోల్ లో సునీల్ గారి నటన ఆకట్టుకుంటుంది. ఈ సినిమా ప్రారంభం ముందు ఒక యానిమేటెడ్ సాంగ్ వస్తుంది. అందులో కథను పరిచయం చేశాక సినిమా మొదలవుతుంది. సినిమా చూసిన వాళ్లందరూ బాగుందని అంటారనే నమ్మకం ఉంది. ఇకపైనా దర్శకుడిగానే కొనసాగుతాను. అన్నారు.
 
నిర్మాత గౌతమ్ కొండెపూడి మాట్లాడుతూ...భరత్ నా ఫ్రెండ్. తనకు అనిపించిన ఇంట్రెస్టింగ్ పాయింట్స్, స్టోరీస్ చెప్పేవాడు. ఒకరోజు ఈ కథ ఎస్ 5 నో ఎగ్జిట్ కథ చెప్పాడు. నాకు బాగా నచ్చింది. కొత్తవాళ్లతో చేద్దాం బడ్జెట్ కంట్రోల్ చేయొచ్చు అని భరత్ అన్నాడు. అయితే కథ చాలా బాగుంది , ప్యాడింగ్ ఆర్టిస్టులతోనే వెళ్దామని డిసైడ్ అయ్యాము. కథ ఓకే అయిన వారంలోనే సెట్ వర్క్ స్టార్ట్ చేశాము. సాయికుమార్, అలీ, సునీల్ వంటి మంచి ప్యాడింగ్ తో ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా నిర్మించాము. అందుకే ఎంతో మంది డిస్ట్రిబ్యూటర్ లు కాంపిటీషన్ కు  వచ్చినా సాగా ఎంటర్టైన్మెంట్స్ వారు భారీ అమౌంట్ ఇచ్చి   రిలీజ్ చేస్తున్నారంటే సినిమా మీద ఎంత నమ్మకమో మీరు అర్ధం చేసుకోవచ్చు.  అలాగే ఒక హర్రర్ సినిమాకు మణిశర్మ లాంటి సంగీత దర్శకుడు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇస్తే ఆ సినిమా యే రేంజ్ లో ఉంటదో మీరే చూస్తారు. సినిమాటోగ్రాఫర్ గరుడ వేగ అంజి కూడ మా సినిమా కు పెద్ద బలం. దాదాపు 200 పైగా థియేటర్ల లో విడుదల కానుంది. ఖచ్చితంగా మా టీమ్ అందరికీ ఈ చిత్రంతో మంచి పేరొస్తుందని ఆశిస్తున్నాం. అన్నారు.