బుధవారం, 22 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : గురువారం, 22 డిశెంబరు 2022 (07:59 IST)

ట్రైన్ లో సాగే కథతో హారర్ థ్రిల్లర్ ఎస్ 5 నో ఎగ్జిట్

sai kumar and others
sai kumar and others
తారకరత్న, ప్రిన్స్, సునీల్, అలీ, సాయి కుమార్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా ఎస్ 5 నో ఎగ్జిట్. భరత్ కోమలపాటి (సన్నీ కోమలపాటి) ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. శౌరీ ఎంటర్ టైన్ మెంట్స్ పతాకంపై ఆదూరి ప్రతాప్ రెడ్డి, దేవు శామ్యూల్, షైక్ రెహీమ్, మెల్కి రెడ్డి గాదె, గౌతమ్ కొండెపూడి నిర్మిస్తున్నారు. హారర్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమా ఈ నెల 30 థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతోంది. తాజాగా ఈ చిత్ర ట్రైలర్ విడుదల కార్యక్రమం హైదరాబాద్ లో జరిగింది.

దర్శకుడు భరత్ కోమలపాటి మాట్లాడుతూ...కొన్ని నెలల పాటు ఈ సినిమా కోసం కష్టపడ్డాం. ఫైనల్ గా మీ ముందుకొస్తున్నాం. ఈ చిత్రంలో ప్రతి ఒక్క ఆర్టిస్ట్, టెక్నిషియన్ మాకు సహకరించారు. ట్రైన్ లో జరిగే కథ ఇది. సాయి కుమార్ గారు, అలీ గారు నేను అడిగిన వెంటనే కీలక పాత్రల్లో నటించారు. నేను అనుకున్న కథను సినిమాటోగ్రాఫర్ గరుడ వేగ అంజి అద్భుతంగా తెరకెక్కించారు. నా నిర్మాతలకు సినిమా ఇండస్ట్రీ గురించి తెలియదు. నా మీద నమ్మకంతో ఈ ప్రాజెక్ట్ లోకి వచ్చారు. సాయి కుమార్ గారు ఈ సినిమాలో చెప్పిన డైలాగ్స్ హైలైట్ అవుతాయి. ఈ చిత్రం చూసి మీరు ఇచ్చే ఫీడ్ బ్యాక్ తో మరింత వర్క్ నేర్చుకుంటా.అన్నారు.
 
సినిమాటోగ్రాఫర్ గరుడ వేగ అంజి మాట్లాడుతూ...ఈ చిత్రానికి రేంజర్ కెమెరా వాడాం. భరత్ సినిమాను అద్భుతంగా తెరకెక్కించాడు. అతనిలో ఇంత ప్రతిభ ఉందని అనుకోలేదు. మొత్తం టీమ్ అంతా యూనిట్ గా కలిసి పనిచేశాం. సినిమా ప్రతి ఒక్కరికీ నచ్చుతుంది. అన్నారు.
 
నిర్మాతలు మాట్లాడుతూ...హారర్ కథతో తెరకెక్కిన భిన్నమైన సినిమా ఇది. కుటుంబమంతా కలిసి చూసేలా ఉంటుంది. సాయి కుమార్ గారి పాత్ర ఆకర్షణ అవుతుంది. అలాగే ఈ చిత్రం 30 వ తేదీన 220 కి పైగా థియేటర్ల లో విడుదల కానుందని అన్నారు.
 
నటుడు సాయి కుమార్ మాట్లాడుతూ...ఈ సినిమాలో ట్రైన్ లో కథంతా సాగుతుంది. అయితే నన్ను ట్రైన్ ఎక్కించలేదు. నేనే ఆ కథను ముందుకు తీసుకెళ్తాను. నా జీవితంలో ఎంతోమంది దిగ్గజ నటులతో కలిసి పనిచేశాను. కొత్త వాళ్ల సినిమా చేసినప్పుడూ అంతే సంతృప్తిగా ఉంటుంది. భరత్ ఈ సినిమాతో మంచి పేరు తెచ్చుకుంటాడు. ఇందులో పరిశ్రమలో పేరున్న నటీనటులను చాలా మందిని తీసుకున్నాడు. వాళ్లందరితో అతను వర్క్ చేయించిన విధానం నాకు నచ్చింది. తప్పకుండా ఈ సినిమా చూడండి. అన్నారు.
 
నటుడు అలీ మాట్లాడుతూ....ఈ సినిమా సెట్ కు వెళ్లినప్పుడు నాకు బ్రేక్ ఇచ్చిన ప్రేమ ఖైదీ సినిమా గుర్తొచ్చింది. పెద్ద పెద్ద దర్శకులు చేయాల్సిన సినిమా ఇది. కథ అంత బాగుంటుంది. నాకు ఓ మంచి క్యారెక్టర్ ఇచ్చాడు భరత్. అతని తర్వాత క్రెడిట్ సినిమాటోగ్రాఫర్ అంజికి ఇవ్వాలి. అన్నారు. 
 
బిగ్ బాస్ ఫేమ్ సన్నీ మాట్లాడుతూ..భరత్ నాకు మంచి ఫ్రెండ్. అతను  డ్యాన్సర్ గా ఫేమస్. ఇప్పుడు దర్శకుడిగా కొత్త స్టెప్ వేశాడు. ఇందులోనూ సక్సెస్ అవ్వాలి. అన్నారు.
 
మెహబూబ్ దిల్ సే, సురేష్ వర్మ, ఫిష్ వెంకట్, రఘు, రితుజా సావంత్, అవంతిక హరి తదితరులు ఇతర పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి ఎడిటర్- గ్యారీ బీహెచ్, సంగీతం - మణిశర్మ, సినిమాటోగ్రఫీ - గరుడ వేగ అంజి, ఆర్ట్ - నాగేంద్ర, స్టంట్స్ - రియల్ సతీష్, పీఆర్వో - జీఎస్కే మీడియా.