ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. సమీక్ష
Written By డీవీ
Last Updated : శుక్రవారం, 30 డిశెంబరు 2022 (13:14 IST)

ఎస్‌ 5 నో ఎగ్జిట్‌ ఎలా వుందంటే! రివ్య్వూ

S5 no ext poster
S5 no ext poster
నటీనటులు: తారకరత్న, ప్రిన్స్‌, సునీల్‌, అలీ, సాయి కుమార్‌, గబ్బర్‌ సింగ్‌ సాయి, ఫిష్‌ వెంకట్‌, రఘు తదితరులు
సాంకేతికత: కెమెరా: అంజి, దర్శకత్వం: భరత్‌ కోమలపాటి (సన్నీ కోమలపాటి), నిర్మాతలు: ఆదూరి ప్రతాప్‌ రెడ్డి, దేవు శామ్యూల్‌, షైక్‌ రెహీమ్‌, మెల్కి రెడ్డి గాదె, గౌతమ్‌ కొండెపూడి.
విడుదల: శుకవ్రారం డిసెంబర్‌ 30.
 
ఈ మధ్య కాలంలో విడుదలకు మందే థియేట్రికల్‌ హక్కులు భారీ అమౌంట్‌ సొంతం చేసుకున్న సినిమా ఎస్‌ 5 నో ఎగ్జిట్‌. టైటిల్‌లోనే ఆసక్తి కలిగించిన ఈ సినిమాలో తారకత్న, ప్రిన్స్‌ ప్రధాన భూమిక పోషించారు. ఎస్‌5 బోగీలో ఏం జరిగింది? అనేది కాన్స్‌ప్టె అని ముందుగా తెలియజేశారు. మరి ఈ రోజే విడుదలైన ఈ సినిమా ఎలా వుందో చూద్దాం.
 
కథ:
సాయికుమార్‌ ఓ రాజకీయపార్టీ అధ్యక్షుడు. తన పార్టీ అధికారంలోకి వస్తే సి.ఎం. అవుతాడు. దానికోసం దేనికైనా తెగిస్తాడు. అందుకు తన కొడుకు అండగా వుంటాడనే ధైర్యం అతనికి వుంటుంది. అలాంటి కొడుక్కి వైజాగ్‌ మీటింగ్‌ ఏర్పాట్లు చూసుకునేందుకు ట్రెయిన్‌లో పంపిస్తాడు. అతనితోపాటు అతని అనుచరులు ఐదుగురు వుంటారు. ట్రైన్‌ బయలుదేరుతుండగా పిన్స్‌ తన డాన్స్‌ ట్రూప్‌తో ఈ బోగీలోకి ఎక్కుతారు. తారకరత్న ఒప్పుకోకపోయినా తర్వాత స్టాప్‌లో దిగుతామని బతిమాలుతారు. ఇక ఆ తర్వాత ఒక్కొక్కరు మాయం అవుతారు. దెయ్యం ఒక్కోక్కరిని చంపేస్తుందని భయపడతారు. ఇక రెండో స్టాప్‌లో టీ.సీ. అలీ, సునీల్‌ ఎక్కుతారు. దెయ్యం గురించి చర్చజరగడం టీసీ హేళన చేయడం, ఇదంతా బిగ్‌బాస్‌ చేయిస్తుందని అనడం ఇలా జరుగుతుండగా చివరి స్టాప్‌ దగ్గరపడుతుందనగా షడెన్‌గా డోర్‌ ఓపెన్‌ కావడంతో తారకరత్న, మరో వ్యక్తి అంత స్పీడ్‌లోనే ట్రైన్‌నుంచి దూకేస్తారు. ఇద్దరూ దెబ్బలతో బయటపడి తన తండ్రిని కలిసి అంతా చెబుతాడు తారకరత్న. అప్పటికే బోగీ దగ్థం. ప్రయాణీకులు సేఫ్‌ అనే వార్త మీడియాలో వస్తుంది. దాంతో షాక్‌కు గురయిన సాయికుమార్‌  ఆ బోగీలో వున్న ఓ సీక్రెట్‌ చెబుతాడు. అదేమిటి? ఆ తర్వాత ఏమి జరిగింది? డాన్స్‌ ట్రూప్‌ ఎందుకు ఎక్కింది? అనే దానికి సమాధానమే మిగిలిన కథ.
 
విశ్లేషణ:
సస్పెన్స్‌ థ్రిల్లర్‌ కథలకు ప్రేక్షకుల్ని ఇన్‌వాల్వ్‌ చేసి కూర్చోపెట్టడం ప్రధాన విషయం. అది దర్శకుడు, సినిమా టోగ్రాఫర్‌ చేశారు. వారిద్దరి ప్రతిభ ఇందులో కనిపిస్తుంది. ట్రైన్‌లో ఎస్‌.5 బోగీ రన్‌ అవగానే డోర్స్‌ లాక్‌ కావడం వంటివి ఇంట్రెస్‌ కలిగించే అంశం. దాన్ని సినిమా మొత్తం చూపించడం అనేది గొప్ప కళ. మధ్య మధ్యలో వచ్చే పాత్రలు ఎంటర్‌టైన్‌ చేయడం, మిగిలినవారి చేత చేయిండం అనేది కీలకం. ఒక దశలో ప్రిన్స్‌ బేచ్‌ ఎందుకు ఎక్కింది. తారకరత్న బేచ్‌లో గొడవపడడం వంటివి లాజిక్‌గా చూపించినా కొంతమేర ఎక్కువయిందనేట్లుగా ఉంది.
 
ప్రధానంగా దెయ్యంతో భయపెట్టిస్తూ ఆద్యంతం పాత్రలన్నీ నటించడం సినిమాకు జీవం పోశాయి. సాయికుమార్ రాజకీయ నాయకుడిగా బాగా చేశారు. తారకరత్న వినూత్నమైన విల్లన్ గా ఆకట్టుకున్నారు. ఫిష్‌ వెంటక్‌, రఘు పాత్రలు ఎంటర్‌టైన్‌ చేయిస్తాయి. అలీ పాత్ర పూర్తి వినోదాన్ని పండిస్తుంది. యూట్యూబ్‌లో వీడియోలు పెట్టి ఫేమ్‌ అయిన సునీల్‌ పాత్ర చేసే తీరు నవ్విస్తుంది. ఇలా అన్ని పాత్రలతో సీరియస్‌, ఎంటర్‌టైన్‌మెంట్‌ రాబట్టారు. ఇక  ట్రైన్‌లో ఎస్‌.5. బోగీనే ఎందుకు డోర్‌ ఓపెన్‌ అవ్వదు అనేది ప్రధాన పాయింట్‌. దాన్ని ఆసక్తికరంగా దర్శకుడు డీల్‌ చేశాడు. ఇందులో ఫైట్‌ మాస్టర్స్‌, సినిమాటోగ్రఫీ పనితీరు అభినందనీయం. ఒక చిన్న పాయింట్‌తీసుకుని దర్శకుడు సినిమాగా మార్చడం, ఎలక్షన్ల టైంలో పలు సంఘటనలు జరగడం వంటివి వార్తలో రావడం వాటిని ఆధారంగా చేసుకుని దర్శకుడు కథగా మార్చడం గ్రేట్‌. రాజకీయనాయకులు పదవికోసం ఎంతకైనా తెగిస్తారు అనేందుకు ఈ సినిమా ఉదాహరణగా పేర్కొనవచ్చు. సీరియస్‌ పాయింట్‌ అయినా ఎంటర్‌టైన్‌గా చెప్పే ప్రయత్నం చేశాడు. ముగింపులో ఈ సినిమా సీక్వెల్‌గా చేయవచ్చు. ఈసారి విమానంలో ఇలా జరిగితే ఎలా వుంటుందనే ట్విస్ట్‌ కూడా ఇచ్చాడు.
 
సాంకేతికంగా చూస్తే, అంజి కెమెరా పనితనం, ఫైటర్‌ కృషి, నేపథ్య సంగీతం ఈ చిత్రానికి ఆకర్షణ. టైటిల్‌లోనే ఎటువంటి ఆర్భాటాలు లేకుండా దర్శకుడు చేసిన సింపుల్‌ ప్రక్రియ ప్లెసెంట్‌గా వుంది. తను నటుడిగా కూడా ఇందులో కనిపిస్తాడు. అతనిలో మంచి డాన్సర్‌కూడా వున్నాడు. చిన్న బడ్జెట్‌ సినిమాల్లో ఎంటర్‌టైన్‌ చేసే సినిమాగా చెప్పవచ్చు. కథనం పరంగా చిన్నపాటి లోపాలున్నా ప్రేక్షకుడికి వినోదం ఇవ్వడమే ధ్యేయంగా చేసిన ఈ సినిమాను చూసి ఆనందించవచ్చు.
రేటింగ్‌:3/5