ఆదివారం, 1 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By వరుణ్
Last Updated : గురువారం, 11 మే 2023 (09:42 IST)

ప్రాణాలు తీసిన సరదా... ప్రైవేటు భాగాలపై గాలి పంప్ చేయడంతో...

తన స్నేహితుడిని ఆట పట్టించేందుకు అతని స్నేహితుడు చేసిన ఓ సరదా ప్రాణాలు తీసింది. తన స్నేహితుడి ప్రైవేటు భాగాల (పురుష నాళంలోకి) పై గాలిని పంప్ చేయడంతో అతను చనిపోయాడు. ఈ విషాదకర ఘటన కేరళ రాష్ట్రంలోని ఎర్నాకుళంలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ కేసు వివరాలను పరిశీలిస్తే, 
 
అస్సాంకు చెందిన మింటూ, సిద్ధార్థ్ అనే ఇద్దరు స్నేహితులు వలస కూలీలుగా కేరళ రాష్ట్రంలో ఉంటున్నారు. ఈ క్రమంలో సిద్ధార్థ్ సరదాగా మింటూను ఆటపట్టించేందుకు అతని ప్రైవేటు భాగాల్లోకి కంప్రెషర్‌ పంపుతో గాలిని పంపింగ్ చేశాడు. దీంతో మింటూకు కడుపు ఉబ్బిపోయింది. దీంతో భయపడిపోయిన సిద్ధార్థ్.. ఆ వెంటనే మింటూను సమీపంలోని ఆస్పత్రికి తరలించాడు.
 
అతన్ని పరీక్షించిన వైద్యులు... అతడు అప్పటికే చనిపోయినట్టు వైద్యులు ధృవీకరించారు. తన స్నేహితుడు మింటూ హఠాత్తుగా స్పృహ తప్పి కిందపడిపోయాడని వైద్యులకు సిద్ధార్థ్ చెప్పాడు. దీంతో అనుమానించిన వైద్యులు.. పోలీసులకు ఫిర్యాదు చేయగా, మింటూను అదుపులోకి తీసుకుని విచారించడంతో అసలు విషయాన్ని వెల్లడించారు. దీంతో కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.