మంగళవారం, 15 అక్టోబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By ఐవీఆర్
Last Modified: శుక్రవారం, 11 మార్చి 2022 (18:39 IST)

బాలికపై ముగ్గురు అన్నదమ్ములు సామూహిక అత్యాచారం

రాజస్థాన్ బార్మర్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. బాలికపై కన్నేసిన ఓ పోస్ట్ మాస్టర్ ఆమెను మాయమాటలతో నమ్మించి ఫంక్షన్ వుందంటూ ఆమెను బలవంతంగా తన ఇంటికి తీసుకుని వెళ్లాడు. ఆ తర్వాత ఆమెపై అత్యాచారం చేసాడు. నిజం చెబితే చంపేస్తానని బెదిరించాడు.

 
ఆ తర్వాత ఆ బాలికను తన సోదరుడికి అప్పగించాడు. ఆమెను ఇంటి వద్ద దిగబెడతానని వెంటబెట్టుకుని వెళ్లిన అతడు జోధ్ పూర్ లోని ఓ ఇంట్లో బంధించి నెలన్నర రోజుల పాటు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ తర్వాత తన ఇద్దరు సోదరులతో కలిసి అందరూ కలిసి ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.

 
ఎలాగో వారి నుంచి తప్పించుకుని వచ్చిన బాలిక విషయాన్ని తన సోదరుడికి చెప్పింది. దాంతో నిందితులపై బాలిక ఫిర్యాదు చేయగా పోలీసులు వారి కోసం గాలిస్తున్నారు.