సంబంధిత వార్తలు
- మాకు తిక్కరేగితే ఆ పత్రిక కార్యాలయాన్ని తగలబెట్టేస్తాం : ఆర్కే రోజా హెచ్చరిక
- స్కూటీని ఢీకొన్న డీసీఎం.. కిలోమీటరు దూరం ఈడ్చుకెళ్లింది.. మహిళ మృతి
- ఐఎంటి హైదరాబాద్‌లో వేడుకగా జరిగిన 2026 బ్యాచ్ స్నాతకోత్సవం
- హైదరాబాద్‌లో ట్రామా- ఎమర్జెన్సీ మెడిసిన్‌పై జాతీయ సదస్సును ప్రారంభించిన రాష్ట్ర గవర్నర్ శ్రీ శివ ప్రతాప్ శుక్లా
- Bellamkonda Sai : తిరుమలలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్, కావ్య రెడ్డి వివాహం
భాగ్యనగరంలో దారుణం.. ట్రైనీ పైలెట్ విద్యార్థినిపై అత్యాచారం
హైదరాబాద్ నగరంలో దారుణం జరిగింది. పైలెట్‌గా శిక్షణ పొందుతున్న విద్యార్థినిపై అదే సంస్థకు చెందిన ఉద్యోగి ఒకరు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటన హైదరాబాద్ నగరంలోని బేగంపేట పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. నిందితుడుని కేరళ రాష్ట్రానికి చెందిన నజీముద్దీన్‌గా గుర్తించారు. శిక్షణ పేరుతో బాధితురాలికి దగ్గరైన కామాంధుడు... ఆమెకు తెలియకుండానే ఫోటోలు, వీడియోలు తీసి బెదిరిస్తూ పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు.
రోజులు గడిచే కొద్దీ అతని నుంచి వేధింపులు మరింతగా పెరిగిపోవడంతో వాటిని భరించలేని ఆ విద్యార్థిని పోలీసులను ఆశ్రయించింది. ఈ దారుణం గత 2025 నుంచి జరుగుతున్నట్టు బాధితురాలు తన ఫిర్యాదులో పేర్కొంది. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు.
మేనకోడలిపై అత్యాచారం... కొడుకుపై క్రిమినల్ కేసు పెట్టిన కన్నతల్లి
కొడుకుపై కన్నతల్లి క్రిమినల్ కేసు పెట్టింది. ఆమె ఇంత కఠిన నిర్ణయం తీసుకోవడానికి కారణం లేకపోలేదు. సొంత మేనకోడలిపై అత్యాచారానికి పాల్పడి, ఆమె గర్భవతి కావడానికి కారణమయ్యాడని పేర్కొంటూ తన కుమారుడుపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఘజియాబాద్ జిల్లాలో వెలుగులోకి వచ్చింది.
పోలీసులు వెల్లడించిన వివరాల మేరకు... జిల్లాలోని భితౌలీ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ బాధితురాలు చిన్నతనంలోనే తల్లిని కోల్పోయింది. తండ్రికి చెడు అలవాట్లు ఉండటంతో బాగోగులు చూసేవారు లేక తన మేనత్త ఇంట్లోనే ఉంటూ పెరిగింది. అయితే, ఇదే అదునుగా భావించిన ఆమె కుమారుడు, బాలికను మాయమాటలతో లోబర్చుకుని శారీరక సంబంధం పెట్టుకున్నాడు.
ఈ క్రమలో బాలిక గర్భం దాల్చడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. బాధితురాలు భయపడుతూనే జరిగిన విషయాన్ని తన అత్తకు వివరించింది. దీంతో ఆమె.. మేనకోడలికి జరిగిన అన్యాయం తెలుసుకుని తీవ్ర దిగ్బ్రాంతికి లోనయ్యారు. కన్న కొడుకని కూడా చూడకుండా బాధితురాలికి న్యాయం చేయాలని నిర్ణయించుకుని నేరుగా పోలీసులను ఆశ్రయించింది.
కన్నకొడుకుపై ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. ఈ ఘటన వెలుగులోకి వచ్చినప్పటి నుంచి నిందితుడు పరారీలో ఉండగా, అతని కోసం పోలీసులు గాలిస్తున్నారు.
