శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 22 ఆగస్టు 2023 (12:35 IST)

అనారోగ్యంతో మంచానపడిన భార్య.. కుమార్తెను గర్భవతిని చేసిన తండ్రి

jail
కంటికి రెప్పలా కాపాడాల్సిన కన్నతండ్రే కామంతో కళ్లు మూసుకునిపోయి కుమార్తె శీలంపై కాటేశాడు. కట్టుకున్న భార్య అనారోగ్యంతో మంచానపడటంతో పడక సుఖం కోసం పరితపించిన ఆ కామాంధుడు.. కన్నబిడ్డను లోబర్చుకుని గర్భవతిని చేశాడు. ఈ దారుణం విశాఖ నగరంలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
గత 2020లో విశాఖ మల్కాపురానికి చెందిన రామచంద్రరావు దంపతులకు ఇద్దరు కుమార్తెలు. భార్య మంచాన పడటంతో కుమార్తెపై (మైనర్ బాలిక) కన్నేశాడు.15 యేళ్ల బాలికను లోబరచుకుని లైంగిక దాడికి పాల్పడుతూ వచ్చాడు. ఈ క్రమంలో ఆ బాలిక అనారోగ్యానికి గురైంది. దీంతో ఆమెను ఆస్పత్రికి తరలించగా, కన్నతండ్రి చేసిన దారుణం వెలుగులోకి వచ్చింది. తన తండ్రే కాటేసి.. గర్భవతిని చేసినట్టు చెప్పింది. దీంతో విశాఖ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసును విచారించిన కోర్టు.. ఆ కామాంధుడికి జీవితకాగార శిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది.