ఆదివారం, 3 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By pnr
Last Updated : బుధవారం, 19 సెప్టెంబరు 2018 (14:13 IST)

ఎమ్మెల్యేల అనర్హత కేసు : 20న తుది తీర్పు.. ఎడప్పాడి సర్కారు పుట్టె మునిగేనా?

తమిళనాడు రాష్ట్రంలో అధికార పార్టీకి చెందిన 18 మంది అన్నాడీఎంకే ఎమ్మెల్యేల అనర్హత కేసులో మద్రాసు హైకోర్టు గురువారం తుది తీర్పును వెలువరించనుంది. ఈ తీర్పుపై రాజకీయవర్గాల్లో సర్వత్రా ఉత్కంఠత నెలకొంది. మూ

తమిళనాడు రాష్ట్రంలో అధికార పార్టీకి చెందిన 18 మంది అన్నాడీఎంకే ఎమ్మెల్యేల అనర్హత కేసులో మద్రాసు హైకోర్టు గురువారం తుది తీర్పును వెలువరించనుంది. ఈ తీర్పుపై రాజకీయవర్గాల్లో సర్వత్రా ఉత్కంఠత నెలకొంది. మూడో జడ్జి ఇచ్చే తీర్పుతో ముఖ్యమంత్రి ఎడప్పాడి ప్రభుత్వం ఉంటుందా? కూలిపోతుందా? అనే చర్చ సాగుతోంది.
 
ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి పని తీరు సరిగ్గా లేనందున, ఆయనను ఆ పదవి నుంచి మార్చేయాలని కోరుతూ దినకరన్‌ వర్గానికి చెందిన మొత్తం 18 మంది ఎమ్మెల్యేలు గత యేడాది రాష్ట్ర ఇన్‌చార్జ్‌ గవర్నర్‌గా ఉన్న సీహెచ్‌ విద్యాసాగర్‌ రావుకు లేఖ సమర్పించిన విషయం తెలిసిందే. తద్వారా వారు పార్టీ నియమనిబంధనల్ని ఉల్లంఘించినందున వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ప్రభుత్వ విప్‌ చేసిన అభ్యర్థన మేరకు అసెంబ్లీ స్పీకర్‌ ధనపాల్‌ వారందరిపైనా అనర్హత వేటువేశారు. 
 
స్పీకర్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఆ ఎమ్మెల్యేలంతా న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. వారి పిటిషన్‌ను విచారించిన ప్రధాన న్యాయమూర్తి ఇందిరా బెనర్జీ, న్యాయమూర్తి సుందర్‌లతో కూడిన ధర్మాసనం గత జనవరి 30వ తేదీన ఆ తీర్పు వెలువరించింది. అయితే ఎమ్మెల్యేలపై అనర్హత వేటు సరైనదేనని ప్రధానన్యాయమూర్తి ఇందిరా బెనర్జీ, స్పీకర్‌ నిర్ణయం సరికాదని న్యాయమూర్తి సుందర్‌ వేర్వేరు తీర్పులు వెల్లడించారు. 
 
దీంతో ఈ కేసు విచారణపై మూడో న్యాయమూర్తి అభిప్రాయం తెలుసుకోవాలని ధర్మాసనం నిర్ణయించింది. మూడో న్యాయమూర్తిగా విమలను నియమించారు. కానీ ఆమె నియామకాన్ని వ్యతిరేకించిన 18 మంది ఎమ్మెల్యేలు సుప్రీంకోర్టును ఆశ్రయంగా, దేశ సర్వోన్నత న్యాయస్థానం మూడో న్యాయమూర్తిగా సత్యనారాయణన్‌ నియమించింది. ఆయన గత నెల 20వ తేదీన కేసు విచారించారు. మూడు రోజుల పాటు జరిగిన విచారణ జరిపి వాయిదా వేశారు. ఈ నేపథ్యంలో ఈ కేసు తుది తీర్పు గురువారం వెల్లడవుతుందన్న ఊహాగానాలు వస్తున్నాయి.