శుక్రవారం, 22 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By వరుణ్
Last Updated : మంగళవారం, 10 అక్టోబరు 2023 (15:36 IST)

గాడిద పాలకంటే ఎలుక పాలు ఖరీదా?

మనకు తెలిసినంతవరకు గాడిద పాలే అత్యధిక ధర. కానీ, ఇపుడు ఎలుక పాలు గాడిత పాల కంటే ఎక్కువని తేలింది. ఈ పాల ధర ఇపుడు లక్షల్లో పలుకుతుంది. పైగా, ఈ పరిశోధకులకు ఎంత ప్రియమైన జంతువుగా పేర్కొంటున్నారు. అత్యంత ఖరీదైన ఈ పాలను సేకరించడం అంత సులభం కాదట. ఒక లీటరు పాలు సేకరించడానికి ఏకంగా 40 వేల ఎలుకలు కావాల్సి ఉందట. సేకరించిన ఒక లీటరు పాల ధర 23 వేల యూరోలు అంటే.. సుమారు రూ.18 లక్షలన్నమాట. 
 
ఈ ఎలుక పాలను పరిశోధనల్లో ఉపయోగిస్తారు. మలేరియా, బ్యాక్టీరియాలను చంపే మందుల తయారీలో ఉపయోగిస్తారు. అయితే, శాస్త్రవేత్తలు ఆవు పాలకు బదులుగా ఈ ఎలుక పాలనే అధికంగా వినియోగించడానికి కారణం లేకపోలేదు. ఎలుక డీఎన్‌ఏ ఇతర జంతువుల డీఎన్ఏ కంటే ఎంతో క్రియాశీలకంగా, ప్రభావవంతంగా ఉంటుంది. పైగా మానవ శరీరానికి సంబంధించినది. అందువల్ల ప్రయోగాల ఫలితాలను విశ్లేషించడం చాలా సులభం. 
 
ప్రయోగాలకు వేల జంతువులు అవసరం. అదే ఆవు అయితే, వేల ఆవులను వినియోగించడం సాధ్యం కాదు. అందుకే శాస్త్రవేత్తలు తమ ప్రయోగాలకు ఎలుకలను ఎంచుకుంటారు. మలేరియాను నయం చేసే మందుల్లోనే కాకుండా రీసెర్స్ మెటీరియల్‌గాను ఈ పాలను వినియోగిస్తారు. అందువల్ల ఈ ఎలుక పాలు పరిశోధనల పరంగా అత్యంత ఖరీదైనవిగా పేర్కొంటున్నారు.