శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By pnr
Last Updated : మంగళవారం, 3 అక్టోబరు 2017 (07:24 IST)

చీకటి ప్రపంచానికి కేరాఫ్ అడ్రస్ లాస్ వెగాస్...

అమెరికాలో ఉన్న ఎడారి నగరాల్లో లాస్ వెగాస్ ఒకటి. దీనికి వందేళ్ళ చరిత్రవుంది. ఇక్కడ నివశించేవారిలో పెక్కుమంది నేరపూరిత స్వభావం కలిగివుంటారు. పైగా, జూదం, వ్యభిచారం, వినోదాలతో మితిమీరిన స్వేచ్ఛతో ఇక్కడి ప

అమెరికాలో ఉన్న ఎడారి నగరాల్లో లాస్ వెగాస్ ఒకటి. దీనికి వందేళ్ళ చరిత్రవుంది. ఇక్కడ నివశించేవారిలో పెక్కుమంది నేరపూరిత స్వభావం కలిగివుంటారు. పైగా, జూదం, వ్యభిచారం, వినోదాలతో మితిమీరిన స్వేచ్ఛతో ఇక్కడి ప్రజలు ఎంజాయ్ చేస్తుంటారు. దీనికితోడు, ఇక్కడ లభించే ఆనందం కోసం ప్రపంచం నలుమూలల నుంచి పర్యాటకులు తరలివస్తుంటారు.
 
అలాంటి నగరంలో ఆదివారం రాత్రి మండేలా బే కేసినోలో మ్యూజిక్ కాన్సర్ట్ ఏర్పాటు చేశారు. వీకెండ్ కావడంతో చాలా మంది దీనిని వీక్షించేందుకు వచ్చారు. సంగీత విభావరి జరుగుతుండగా దుండగుడు కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో 58 మంది వరకు మృత్యువాతపడ్డారు. దీంతో ఈ నగరం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఈ కాల్పుల ఘటనకు ఈ మితిమీరన స్వేచ్ఛ కారణమని చెబుతున్నారు.  
 
లాస్ వెగాస్ 1848లో మెక్సికో నుంచి అమెరికా పాలనలోకి వచ్చింది. 1855లో స్థానిక గిరిజనులు కోట కట్టుకుని అక్కడ నివాసం ఏర్పాటు చేసుకున్నా ఎక్కువకాలం ఉండలేకపోయారు. దీంతో ఓ ఎస్టేట్ యజమానికి ఆ కోటలో స్థిరనివాసం ఏర్పాటు చేసుకుని లాస్‌వేగాస్ రాంచ్ అని పేరు పెట్టుకున్నాడు. 
 
ఆరంభంలో ఇక్కడ ఎస్టేట్ యజమానులు, కార్మికులు మాత్రమే నివసించేవారు. అయితే 1905లో రైల్ రోడ్ కంపెనీ ఇక్కడ ప్లాట్లు వేసింది. 1911లో లాస్‌వేగస్ కార్పొరేషన్‌ను ఏర్పాటు చేశారు. తర్వాతి కాలంలో ఈ నగరం చీకటి ప్రపంచానికి కేరాఫ్ అడ్రస్‌గా మారింది.
 
వ్యభిచారం, జూదం, ఇతర వినోద కార్యక్రమాలు ఇక్కడ నిత్యకృత్యం. ప్రపంచం నలుమూలల నుంచి కోట్లాదిమంది పర్యాటకులు ఇక్కడకు వస్తుంటారు. లక్షల కోట్ల డాలర్లను నీళ్లలా కుమ్మరిస్తారు. డ్రగ్స్, దొంగ వ్యాపారాల్లో సంపాదించిన మొత్తాన్ని ఇక్కడి కేసినోలలో పెడుతూ ఆనందాన్ని వెతుక్కుంటారు. ఇక్కడి ప్రధాని ఉపాధి కేసినోలే. 2008లో ప్రపంచం మొత్తం ఆర్థిక మాంద్యంతో అల్లాడిపోయినా, లాస్‌వేగాస్‌పై మాత్రం ఆ ప్రభావం పడలేదంటే పరిస్థిని అర్థం చేసుకోవచ్చు.