గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By సెల్వి
Last Updated : శనివారం, 26 జూన్ 2021 (10:20 IST)

ఇంటర్నేషనల్ డ్రగ్స్ డే : మత్తు పదార్థాలకు టాటా చెప్పేద్దాం..

జూన్ 26వ తేదీ.. అంతర్జాతీయ మాదకద్రవ్యాల నివారణ దినోత్సవం (ఇంటర్నేషనల్ డ్రగ్స్ డే). ఈ దినోత్సవాన్ని పురస్కరించుకుని పలు ప్రాంతాల్లో యాంటీ డ్రగ్స్ డే కార్యక్రమాలను నిర్వహించడం ఆనవాయితీ. కానీ, కరోనా వైరస్ వ్యాప్తి, లాక్డౌన్ కారణంగా ఇపుడు అన్నీ వీడియో కాన్ఫరెన్స్‌లలోనే నిర్వహించేస్తున్నారు. 
 
ముఖ్యంగా ఇలాంటి సదస్సుల్లో మారక ద్రవ్యాలను తీసుకోవడం వల్ల కలిగే నష్టాలను యువతకు వివరిస్తుంటారు. యుక్త వయస్సులో ఉన్నప్పుడే మత్తు పదార్థాలకు అలవాటు పడుతుంటారు. ఆడ మగా అని తేడా లేదు అమ్మాయిలు కూడా మత్తుకు బానిసలవుతున్నారు. ఒక్కసారి అలవాటు పడితే మత్తు ముంచేస్తుంది. దీని బారిన పడి ఎంతో మంది చిక్కుల్లో పడుతున్నారు. తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు.
 
తల్లిదండ్రులు పట్టించుకోకపోడం, ఉద్యోగ సమస్య వంటివి యువత మత్తుకు అలవాటు పడేందుకు ప్రధాన కారణాలుగా చెప్పవచ్చు. చిన్న వయసులోనే పిల్లలు మత్తుకు అలవాటు పడుతున్నారు. ఇంట్లో గొడవలు, పెంపకంలో లోపాలు, తల్లిదండ్రుల్లో ఎవరో ఒకరికి అలవాటు ఉండటం పిల్లల్ని మత్తుపదార్థాల వైపు చూసేలా చేస్తున్నాయి. 
 
ఈ మత్తపదార్థాలకు ఒకసారి బానిసైతే చాలు దుష్ప్రభావాలు ఉంటాయి. ముఖ్యంగా ఏపీలో మత్తు పదార్థాల సరఫరాలను నియంత్రించడంలో అధికార యంత్రాంగం పూర్తిగా విఫలమైంది. పోలీసులు చర్యలు చేపడుతున్నామని చెబుతున్నా.. వివిధ రకాల మత్తు పదార్థాలు లభ్యమవుతూనే ఉన్నాయి.