శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. కథనాలు
Written By సిహెచ్
Last Modified: శనివారం, 12 జూన్ 2021 (21:50 IST)

మహత్తును చూపే ధ్యానం

మనిషి జీవక్రియలను, ప్రవర్తనను, ఆచరణను మెదడు నిర్ణయిస్తుంది. మెదడు పని చేయడం వల్లే మనసు ఏర్పడుతుంది. ఈ మనస్సే ధ్యానానికి మూలం.
 
ధ్యానం చేయడం ద్వారా శరీరంలోని అవయవాలను, నాడీవ్యవస్తను, శక్తి కేంద్రాలను శుద్ది చేసుకుని శక్తివంతంగా మార్చుకోవచ్చు. అంతేకాదు అనంత విశ్వంగా శరీరాన్ని తీర్చిదిద్దవచ్చు. ఇంతటి మహత్తు ఉన్నది కాబట్టే మోక్ష సాధనకు ధ్యానమే మార్గమని విశ్వసించారు మన పూర్వీకులు. 
 
ఆత్మ సాక్షాత్కరానికి, పరమాత్మ దర్శనానికి ధ్యానాన్నే వేదికగా ఎంచుకున్నారు. శరీరంలోని అవయవాలు బ్రహ్మం వల్లే పని చేస్తున్నాయని ఉపనిషత్తులు చెప్తున్నాయి. ఆ బ్రహ్మం ఉత్తేజితం కావాలంటే ధ్యానానికి మించిన మార్గం లేదు.