1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By Selvi
Last Updated : మంగళవారం, 6 జనవరి 2015 (12:52 IST)

అంతా ఓవర్.. ఇక కాంగ్రెస్‌లోకి జగన్.. సీఎం కల నిజమయ్యేనా?

రాష్ట్ర విభజనతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కథ ముగిసినట్లైంది. ఇప్పటికే వైకాపా నుంచి ఇతర పార్టీలకు వలస పక్షులు పెరిగిపోతున్న తరుణంలో కాంగ్రెస్ పార్టీలోకే జంప్ అయిపోవాలని జగన్ భావిస్తున్నట్లు సన్నిహితుల సమాచారం. 
 
తెలంగాణలో ఉండే కాంగ్రెస్‌ను మెల్ల మెల్లగా బలోపేతం చేస్తూ.. ఏపీలోనూ కాంగ్రెస్‌ను బలపరచాలంటే.. ఇక జగనే గతి అని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తోంది. ఒకప్పుడు జగన్‌ను ఆటాడుకున్న కాంగ్రెస్ ప్రస్తుతం వేరే దారి లేక జగన్మోహన్ రెడ్డినే దారిలోకి తెచ్చుకుని పార్టీలో చేర్పించుకునేందుకు పావులు కదుపుతోంది. 
 
జగన్ కూడా అధిష్టానం వైపే చూస్తున్నట్లు సమాచారం. అధిష్టానం నుంచి పిలుపొచ్చిన వెంటనే తండ్రిగారున్న పార్టీలోకి జంప్ అయి, పార్టీని విలీనం చేసేసి చక్కగా కాంగ్రెస్‌ కండువా మళ్లీ కప్పుకునేందుకు సాయశక్తులా ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. 
 
అయితే కాంగ్రెస్‌లో ఇంకా చిరంజీవి ఉండటంతో జగన్ సీఎం కల నెరవేరుతుందో లేదో అనేది ప్రశ్నార్థకమే. కానీ సీఎం అభ్యర్థిగా తనను ప్రకటిస్తే మాత్రమే జగన్ కాంగ్రెస్ పార్టీలో చేరే ఛాన్సుందని, లేకుంటే వైకాపాతోనే సరిపెట్టుకోవాల్సిందేననే నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. మొత్తానికి జగన్ సీఎం కల ఇలాగైనా నెరవేరుతుందో? లేదో? వేచి చూడాల్సిందే.!