శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By ivr

డేరా బాబా కోసం 'పితాజీ మాఫీ' సాధ్విలు... అమ్మాయిలకు అలా ట్రెయినింగ్..

డేరా బాబా లీలలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. డేరా బాబా అశ్లీల కోటలో జరిగే దారుణాలు వెలుగుచూస్తున్నాయి. ఇక్కడ డేరా బాబా కామ దాహానికి నలిగిపోయిన యువతుల జీవిత గాధలు బయటకు వస్తున్నాయి. బాబా ఆశ్రమంలో 'ప

డేరా బాబా లీలలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. డేరా బాబా అశ్లీల కోటలో జరిగే దారుణాలు వెలుగుచూస్తున్నాయి. ఇక్కడ డేరా బాబా కామ దాహానికి నలిగిపోయిన యువతుల జీవిత గాధలు బయటకు వస్తున్నాయి. బాబా ఆశ్రమంలో 'పితాజీ మాఫీ' సాధ్విలు అంటూ 350 మంది మహిళలు వున్నారు. వీరిలో 90 శాతం మహిళలు డేరా బాబా కామ దాహానికి బలైనవారే. ఇక వారు చేసేదేమిటంటే... కొత్తగా బాబా ఆశీర్వాదం కోసం వచ్చే యువతుల్లో ఎవరి పైన బాబా కన్ను పడుతుందో వారిని బాబా కామ దాహాన్ని తీర్చేందుకు పంపించడమే. ఐతే ఇది ఒక్కసారిగా జరుగదు. 
 
సదరు యువతికి ఓ వారం పాటు క్లాసులు తీసుకుంటారు. ఆమెను బాబాతో శృంగారం చేసేందుకు మానసికంగా సిద్ధం చేస్తారు. ఈ శృంగారం పవిత్ర కార్యంగా చిత్రీకరిస్తారు. తామంతా తమ శీలాలను బాబాకు సమర్పించుకుని ధన్యులమైనట్లు నూరిపోస్తారు. ఆ దెబ్బతో సదరు యువతి అంగీరిస్తే సరి. ఒకవేళ ఆమె అంగీకరించకపోతే... భయంకర క్లాసు ప్రారంభమవుతుంది. బాబాను కాదంటే ఏదో జరగరానిది జరిగిపోతుందనీ, ఇంట్లో కుటుంబ సభ్యులకు దోషం పట్టుకుంటుందనీ చెప్తారు. దాంతోనైనా యువతి దారికి వస్తే ఇక బాబా కామదాహానికి ఆమె బలవుతుంది. ఒకవేళ అన్ని క్లాసులు ముగిసినా ఆమె దారికి రాకపోతే ఇక ఆమెపై డేరా బాబా అత్యాచారం చేస్తాడు. 
 
బలవంతంగా ఆమెపై తన పశు వాంఛ తీర్చుకుంటాడు. ఇలా కొన్ని వందల మంది అమ్మాయిల జీవితాలను నాశనం చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పటివరకూ డేరా బాబాకు ఇద్దరు మహిళలు చేసిన ఫిర్యాదు మేరకు 20 ఏళ్ల జైలు శిక్ష పడింది. కానీ అతడి బాధితులంతా కోర్టు మెట్లెక్కితే ఆ కామాంధ బాబాకు శిక్ష అనుభవించడానికి జీవితం సరిపోదు. 
 
ఐతే దీనికి కారణం ఎవరు? అతడు కోర్టులో హాజరయ్యేందుకు 30 కార్ల కాన్వాయ్‌తో వచ్చాడు. అంటే అతడి పవర్ ఏమిటో అర్థమవుతుంది. డబ్బు... మిలిటెంట్లు... పొలిటికల్ పవర్... ఇలా అన్నింటినీ అడ్డం పెట్టుకుని డేరా బాబా ఎందరో జీవితాలను సర్వనాశనం చేశాడు. ఇలాంటి బాబాలకు నాయకులు వెన్నుదన్నుగా వున్నంతవరకూ సమాజాన్ని సర్వనాశనం చేస్తూనే వుంటారు. ఈ కామ బాబాలు ఇంకా వస్తూనే వుంటారు. తస్మాత్ జాగ్రత్త.