శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By ttdj
Last Modified: బుధవారం, 21 డిశెంబరు 2016 (16:30 IST)

శేఖర్ రెడ్డి 'బంగారు వాకిలి... బంగారు వాకిలీ' అన్నాడు... దొంగ సొమ్ముతో దొరికిపోయాడు... ఆ స్థానం...

తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలిలో సభ్యుడు. ఈ హోదా దేశంలోనే అత్యున్నతమైనదని అందరూ భావిస్తుంటారు. ఎవరితోనైనా ఈజీగా పరిచయం పెంచుకునే హోదా కాబట్టి ఎవరికైనా శ్రీవారి దర్శనం చేయించే సత్తా ఉన్న పదవి అది. అందుకే టిటిడి పాలకమండలి పదవి కోసం పోటీలు పడుతుంటార

తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలిలో సభ్యుడు. ఈ హోదా దేశంలోనే అత్యున్నతమైనదని అందరూ భావిస్తుంటారు. ఎవరితోనైనా ఈజీగా పరిచయం పెంచుకునే హోదా కాబట్టి ఎవరికైనా శ్రీవారి దర్శనం చేయించే సత్తా ఉన్న పదవి అది. అందుకే టిటిడి పాలకమండలి పదవి కోసం పోటీలు పడుతుంటారు. అందులో ఛైర్మన్‌ కాకపోయినా కనీసం సభ్యుడు అయినా సరే ఫర్వాలేదు అని భావిస్తుంటారు. తమకు తెలిసిన వారితో విపరీతంగా ప్రయత్నాలు చేసి మరీ పాలకమండలిలో సీటు కోసం ప్రయత్నాలు చేస్తారు. అయితే అలాంటి టిటిడి పాలకమండలి పదవిని చేజేతులా పోగొట్టుకున్నారు శేఖర్‌ రెడ్డి.
 
ఇప్పటికే మీకు అర్థమై ఉంటుంది. శేఖర్ రెడ్డి గురించి అంత వివరంగా చెప్పాల్సినంత అవసరం లేదు. ఎందుకంటే శేఖర్ రెడ్డి గురించి ఇప్పటికే అందరికీ తెలిసిపోయింది. అతి పెద్ద నల్లకుబేరుడు ఈయనే అని దేశం మొత్తం తెలిసిపోయింది. అయితే శేఖర్ రెడ్డి ముందు నుంచి క్లాస్‌ ఒన్‌ కాంట్రాక్టర్‌గా తమిళనాడులో ఉంటూ వచ్చారు. తమిళనాడు సిఎం జయలలితకు అత్యంత సన్నిహితుడు. ఆమె ఒక్కరికే కాదు పన్నీరు సెల్వం, శశికళ, రామ్మోహన్ రావు... ఇలా చెప్పుకుంటూ పోతే తమిళనాడులోని ప్రముఖులందరికీ ఈయన మంచి స్నేహితుడే.
 
అందుకే టిటిడి పాలకమండలి సభ్యుని స్థానం అవలీలగా లభించింది. అలా వెళ్ళి, ఇలా సభ్యుడిగా పదవిని సంపాదించేశాడు. సంవత్సరం వరకు బాగానే ఉన్నాడు. అయితే ఏ ఒక్క నిర్ణయాన్ని కూడా పాలకమండలి ముందు ఉంచడు. తూతూ మంత్రగా పాలకమండలికి వస్తాడు. కూర్చుని వెళ్ళిపోతాడు ఆయన. ఐతే ఏదో ఒక సందర్భంలో బంగారు వాకిలి వద్ద బంగారు తాపడం చేయిస్తానని అన్నారట. ఆ మాట వేంకటేశునికి కోపం వచ్చిందేమో తెలియదు కానీ పదవి ఊడింది.
 
శేఖర్ రెడ్డి పాలకమండలి సభ్యుడిగా ఉండి పదవి పోగొట్టుకోవడంతో మండలిలో ఇప్పుడు ఒక సంఖ్య తగ్గింది. అదే శేఖర్ రెడ్డి పోస్టు. ప్రస్తుతం పాలకమండలి సమయం కూడా అతి తక్కువగా ఉంది. కేవలం 6 నుంచి 7 నెలలు మాత్రమే. అందుకే ఇక చేసేది లేక ఆ పదవిని అలా ఉంచేసే ఆలోచనలో ఎపి సిఎం చంద్రబాబునాయుడు ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఆ పదవికి తీరని మచ్చ తెచ్చిన శేఖర్ రెడ్డి స్థానంలో మరో వ్యక్తిని ఉంచాలన్న ఆలోచనలో బాబుకు లేనట్లు తెలుస్తోంది. సాధారణంగా పాలకమండలిలో సభ్యుడి తగ్గినా వెంటనే తీసుకునే అవకాశం ఉంది. కానీ శేఖర్ రెడ్డి చేసిన తప్పిందం కారణంగా తెలుగుదేశంపార్టీకి చెడ్డపేరు వచ్చింది. దీంతో ఆ పదవిని అలాగే ఉంచేయ్యాలన్న ఆలోచనలో బాబు ఉన్నట్లు తెలుస్తోంది.