శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By ఎం
Last Updated : ఆదివారం, 7 జులై 2019 (17:56 IST)

సామాన్యుడిపై వేదింపులా? #WeAreWithKarthik అంటోన్న నారా లోకేష్

ప్రజాస్వామ్యంలో వైకాపా చీఫ్, ఏపీ సీఎం జగన్ ప్రజల గొంతు నొక్కాలని చూస్తే అది ఒక విప్లవానికి నాంది పలుకుతుంది. ఒక సామాన్య పౌరుడు అయిన కార్తీక్ మీ ప్రభుత్వాన్ని ఎండగడుతుంటే అతనిని కేసుల పేరుతో వేధింపులకు గురి చెయ్యడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నామని చెప్పారు. 


కార్తీక్‌కు మేము అండగా నిలబడతామని నారా లోకేష్ హామీ ఇచ్చారు. కార్తీక్‌కు అన్ని సహాయాలు అందించే బాధ్యత తానే స్వయంగా తీసుకుంటా. ఇది ఎక్కడి వరకైతే అక్కడ వరకు అతనికి తోడుగా ఉంటానని నారా లోకేష్ వెల్లడించారు. ఈ మేరకు ట్విట్టర్‌లో స్పందించిన నారా లోకేష్.. వి స్టాండ్ విత్ కార్తీక్ అనే హ్యాష్ ట్యాగ్‌ను కూడా జతచేశారు. 
 
అలాగే మెడలు వంచి ప్రత్యేక హోదా సాధిస్తామన్నారు. ఈరోజు ప్రత్యేక హోదా ఊసే లేదు. ఏది మీ పోరాటం? ఏది మీ మడమ తిప్పని నైజం? కాళ్ళకు సాష్టాంగ పడటం, భజన చేయడమే పోరాటం అనుకుంటున్నారా? ఏపీ ప్రయోజనాలను సాధించడానికి మీరేం చేయదలచుకున్నారో చెప్పండి.

ఇది ప్రజల తరపున మా డిమాండ్.. అంటూ నారా లోకేష్ ట్వీట్ చేశారు. ట్విట్టర్ ద్వారా వైకాపా సర్కారును ఎండగడుతూ నారా లోకేష్ విమర్శలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే.