1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By జె
Last Modified: మంగళవారం, 15 మార్చి 2022 (18:46 IST)

బొత్స మంత్రి పదవి పోతుందా? విజయసాయికి విపరీతంగా ఫోన్లు, ఎవరు?

త్వరలో మంత్రివర్గ విస్తరణ జరుగబోతోంది. ఈ నెల 27వ తేదీ రెండున్నరేళ్లుగా పనిచేసిన కొందరు మంత్రులు రాజీనామా చేయడానికి సిద్థమయ్యారు. ఇప్పటికే ఎవరు రాజీనామా చేయాలన్నది ముఖ్యమంత్రి చెప్పేశారట. కానీ మంత్రులు మాత్రం ఆ విషయాన్ని బయటకు చెప్పడం లేదు. ఎలాగోలా పోయే పదవే కదా... రాజీనామా చేసేటప్పుడు జనం తెలుసుకుంటారు.. ఇప్పుడే ఎందుకు చెప్పుకుని వాళ్ళ నోళ్ళలో నానాలని అనుకుంటున్నారట మంత్రులు.

 
అయితే ఇప్పటివరకు ఉన్న మంత్రుల్లో ప్రధానంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కొడాలి నాని, పేర్ని నానిలు మాత్రం మంత్రులుగా కొనసాగబోతున్నారట. ఇక బుగ్గన రాజేంద్రనాథ్, బాలినేని శ్రీనివాసులలో ఎవరికో ఒకరికే ఛాన్స్ ఉండే అవకాశం కనిపిస్తోంది. అందులో బుగ్గనకే ఎక్కువ ఛాన్స్ ఉందంటున్నారు విశ్లేషకులు.

 
ఇక హోంమంత్రి అయితే మహిళకే కేటాయించనున్నారట. ఐదుగురు ఉపముఖ్యమంత్రులు ఉండబోతున్నారట. 50 శాతం మంత్రి పదవులు బిసీలకు కేటాయించడానికి ముఖ్యమంత్రి సిద్ధమయ్యారట. 33 శాతం మంత్రి పదవులు మహిళలకు ఇవ్వబోతున్నారట. బొత్సకు పార్టీ రీజినల్ కమిటీ బాధ్యతలు అప్పగించబోతున్నారట. అంటే మంత్రి పదవి పోయినట్లే. 25 జిల్లాలకు మంత్రి పదవులు ఉండబోతున్నాయట. తొలిసారిగా గెలిచిన ఎమ్మెల్యేలకు కూడా మంత్రి పదవులు ఇవ్వబోతున్నారట సిఎం. 

 
ఈ మొత్తం బాధ్యతలను విజయసాయిరెడ్డికి అప్పగించారట. దీంతో విజయసాయిరెడ్డికి ఎమ్మెల్యేలు ఒకటే ఫోన్లు మీద ఫోన్లు చేసేస్తున్నారట. మాకు మంత్రి పదవి ఉందా లేదా.. లిస్టులో మా పేర్లను చేర్చారా లేదా అని అడుగుతున్నారట.

 
గత రెండురోజుల నుంచి విజయసాయిరెడ్డి ఫోన్లో మాట్లాడాలంటేనే భయపడిపోతున్నారట. ఎమ్మెల్యేల ఫోన్లు అంటేనే పక్కన పడేస్తున్నారట. వచ్చిన వారికి సరే రాని వారికి ఎలాంటి సమాధానం చెప్పాలో తెలియక సతమతమవుతున్నారట విజయసాయిరెడ్డి. కానీ తనకు బాగా పరిచయస్తులైన వారికి మాత్రం మంత్రి పదవులు వస్తుండటం విజయసాయిరెడ్డికి సంతోషాన్ని కలిగిస్తోందట.