నోట్ల మార్పిడి కేసు.. సినిమాలపై పిచ్చి.. విశాఖ సీఐ స్వర్ణలత ఖతర్నాక్
నోట్ల మార్పిడి కేసులో విశాఖ సీఐ స్వర్ణలతకు సంబంధించిన విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. బాధితుల ఫిర్యాదుతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. పక్కా ప్లాన్‌తో రూ. 12 లక్షలను సీఐ కొట్టేసినట్లు తేలింది.
విశాఖపట్టణం నోట్ల మార్పిడి కేసులో ఇద్దరు వ్యక్తులను బెదిరించి రూ. 12 లక్షలు వసూలు చేసిన ఏఆర్ ఇన్‌స్పెక్టర్ స్వర్ణలతకు సినిమాలంటే పిచ్చి.
సినిమాలపై ఇష్టం పెంచుకున్న ఆమె ఏపీ 31 పేరుతో రూపొందుతున్న సినిమాలో హీరోయిన్‌గానూ నటిస్తోంది. కొరియోగ్రాఫర్‌ను పెట్టుకుని శిక్షణ తీసుకుని.. ఇటీవల ఆమె చేసిన డ్యాన్స్ వీడియోలు వైరల్ అయ్యాయి.
వివరాల్లోకి వెళితే.. గాజువాకకు చెందిన విశ్రాంత నేవీ ఉద్యోగులు కొల్లి శ్రీను, శ్రీధర్‌లకు రియల్ ఎస్టేట్ బ్రోకర్ వి.సూరిబాబు నోట్ల మార్పిడికి సంబంధించి ఆశ పెట్టాడు.
రూ. 90 లక్షల విలువైన రూ. 500 నోట్లు ఇస్తే కోటి రూపాయల విలువైన రూ. 2 వేల నోట్లు ఇస్తామని, దీంతో రూ. 10 లక్షలు మిగులుతుందని ఆశ చూపాడు.
తనకు రూ. 12 లక్షలు ఇస్తే కేసు లేకుండా చేస్తానని చెప్పడంతో అడిగినంతా ఇచ్చేసి వెళ్లిపోయారు. దీంతో 12 లక్షలు దోచేసిన సీఐపై దర్యాప్తు జరుగుతోంది.