శుక్రవారం, 8 నవంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. దీపావళి
Written By సిహెచ్

దీపావళి 2020: ఎప్పుడు వస్తుంది? లక్ష్మీపూజ ముహూర్తం ఎప్పుడు?

కరోనా మహమ్మారి కారణంగా ఇపుడు పండుగలు కూడా ఇంట్లోనే చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. దేవాలయాలు తెరిచినప్పటికీ భౌతిక దూరం పాటిస్తున్నప్పటికీ బిక్కుబిక్కుమంటూ దైవదర్శనం చేసుకునే కంటే ఇంట్లోనే ఆ దేవతలకు పూజలు చేసుకుని కరోనా మహమ్మారిని నిరోధించాల్సిన పరిస్థితి. ఇక అసలు విషయానికి వస్తే ఈ నెల 14వ తేదీ శనివారం వస్తోంది. 
 
ఈ సందర్భంగా దీపావళికి సంబంధించి తేదీ, రోజు మరియు ముహూర్తం గురించి తెలుసుకుందాం.

నవంబర్ 14 శనివారం లక్ష్మి పూజ. లక్ష్మి పూజ ముహూర్తం సాయంత్రం గం 4:35 నిమిషాల నుండి గం 6:31 నిమిషాల వరకు.
 
ప్రదోష కాలం.. అంటే పూజలకు అత్యంత పవిత్రమైన సమయం సాయంత్రం గం 4:34 నిమిషాల నుండి రాత్రి 7:11 నిమిషాల వరకు. వృషభ కాలం సాయంత్రం గం 4:35 నిమిషాల నుండి 6:31 నిమిషాల వరకు.
 
అమావాస్య తిథి నవంబర్ 14 మధ్యాహ్నం 2:17 గంటలకు ప్రారంభమవుతుంది. మరుసటి రోజు అమావాస్య తిథి నవంబర్ 15 ఉదయం 10:36 గంటలకు ముగుస్తుంది. కనుక పైన తెలిపిన వివరాలను అనుసరించి లక్ష్మీదేవికి పూజలు చేసుకుంటే అమ్మవారు కోరిన కోర్కెలు నెరవేర్చుతారు.