దీపావళి లోపుగా ఈ వస్తువులు వుంటే పడేయండి...

సోమవారం, 9 నవంబరు 2020 (19:17 IST)
దీపావళి అంటే దీపాల పండుగ.. ఇలాంటి పండుగ కోసం చిన్నపిల్లలు ఎదురుచూస్తూ ఉంటారు. దీపాలు వెలిగించి బంధువులతో కలిసి టపాసులు కాల్చవచ్చని అనుకుంటుంటారు. కానీ పెద్దవారు మాత్రం ఆరోజు లక్ష్మీదేవిని పూజించి ఇంటిలోకి ఆహ్వానించాలని అనుకుంటుంటారు. దీపావళి లక్ష్మీదేవి పుట్టినరోజు అని పెద్దలు చెబుతుంటారు. 
 
లక్ష్మీదేవి పుట్టినరోజు విష్ణుమూర్తి నీకేం కావాలని అడిగితే నేను భూలోకానికి నేరుగా వెళ్ళి అంతా చూడాలనే కోరిక ఉందని చెప్పిందట. విష్ణుమూర్తి సరేనని పంపారు. అలా ప్రతి దీపావళి రోజు లక్ష్మీదేవి స్వయంగా భూలోకానికి వస్తుంది. 
 
లక్ష్మీదేవికి శుభ్రంగా వున్న ఇల్లు అంటే చాలా ఇష్టం. అందుకే దీపావళికి ముందు నాలుగు రోజుల నుంచి ఇంటిని శుభ్రం చేసుకోవాలి. ఇంటిని మాత్రమే శుభ్రం చేసుకోవడం కాదు.. పనికిరాని వస్తువులను ఇంట్లో ఉంచితే నెగిటివ్ ఎనర్జీ వస్తుంది. 
 
పగిలిన అద్దం ఇంట్లో ఉంచితే ఇంట్లో గొడవలు జరుగుతూ ఉండటమే కాకుండా మనస్ఫర్థలు వస్తాయి. ఇంట్లో మంచం విరిగి ఉన్నా శబ్దాలు వస్తున్నా వాటిని బాగు చేయించాలి..లేకుంటే బయట పడేయాలి. 
 
ఆగిపోయిన గడియారం.. విరిగిన గడియారం ఉంటే పడేయాలి.. లేకుంటే ఏ పని మొదలెట్టినా ఆటంకాలు వస్తాయి. చెద పట్టిన ఫోటోలు ఉంటే బయట పడేయాలి. ఇంటి ముఖ ద్వారానికి రిపేర్లు ఉంటే చేయించాలి. 
 
చిన్న పిల్లలు ఆడుకునే బొమ్మలు విరిగిపోయి వుంటే వాటిని కూడా పడవేయాలి. చిరిగిన బట్టలు పడవేయాలి. ఇవన్నీ ఇంట్లో ఉంటే లక్ష్మి ఇంటికి రాదు. గత యేడాది వాడిన దీపాలను మళ్ళీ వాడకూడదు. ఎవరి శక్తికొద్దీ వారు కొత్త దీపాలను కొనుగోలు చేసి దీపావళిని చేసుకుంటే మహాలక్ష్మి కటాక్షిస్తుంది.

అన్నీ చూడండి

వంటగదిలో ప్రమాదానికి గురైన వధువు, ఆస్పత్రిలో పెళ్లి చేసుకున్న వరుడు, వీడియో

భగీరథ్‌ను పోలీసులకు అప్పగించాం.. కేంద్ర మంత్రి బండి సంజయ్

వావ్, క్యాంపస్ సెలక్షన్స్‌లో విజయవాడ విద్యార్థినికి రూ. 48 లక్షల ప్యాకేజీ

సీన్ రివర్స్: ప్రియుడు డబ్బులివ్వలేదు.. భర్త సాయంతో చంపి డ్రమ్ములో కుక్కి డ్రైన్‌లో పడేసింది

బండి సంజయ్ కుమారుడిపై పోక్సో కేసు : బాధితురాలి వాంగ్మూలం నమోదు

అన్నీ చూడండి

17-05-2016 ఆదివారం ఫలితాలు - మీ గౌరవానికి భంగం కలుగకుండా మెలగండి..

17-05-2026 నుంచి 23-05-2026 వరకు మీ వార ఫలితాలు

Amavasya: అమావాస్య రోజున హనుమంతునికి పూజ.. ఆలయానికి వెళ్తే...?

అమావాస్య రోజున శని జయంతి- ఏకకాలంలో అదృష్ట యోగాలు.. ఈ రాశుల వారికి?

16-05-2026 శనివారం ఫలితాలు (అమావాస్య) - 12 రాశుల వారికి ఈ రోజు ఎలా వుంది?

తర్వాతి కథనం
Show comments