శుక్రవారం, 23 ఫిబ్రవరి 2024
  1. ఇతరాలు
  2. మహిళ
  3. ఫ్యాషన్
Written By ఐవీఆర్
Last Modified: సోమవారం, 11 డిశెంబరు 2023 (23:04 IST)

పార్టీ సీజన్ కోసం 'ప్లాటినమ్ ఎవారా'

platinum Earrings
ఇయర్ ఎండింగ్ అనగానే ఒక్కొక్కరు ఒక్కో రకంగా ఎంజాయ్ చేసేందుకు సిద్ధపడుతూ ఉంటారు. కుటుంబ సభ్యులతోనూ స్నేహితులతోనూ ఆనందంగా గడిపేందుకు పార్టీలు చేసుకుంటారు. ఒక పక్క క్రిస్మస్, ఇంకో పక్క న్యూ ఇయర్ ఈ వేడుకలకు వేదికగా నిలుస్తాయి. మధ్యాహ్న భోజనాలు, స్నేహితులతో విందులు, వివాహాలు, క్రిస్మస్, న్యూ ఇయర్ లతో హడావుడిగా ఉంటుంది. ఇటువంటి సందర్భాలు కావాల్సిన వారితో ఉండే సమయాలు. ఎలివేట్ కావడానికి సరైన సమయం. ప్రతి సందర్భానికి సరైన దుస్తులను ఎలా అయితే ఎంచుకుంటామో.. సరైన ఆభరణాలను ఎంచుకోవడం కూడా అవసరం. ఇది రూపాన్ని మరింత ఆకర్షణీయంగా మలుస్తుంది. అందుకు 'ప్లాటినం ఎవారా' ఎంతగానో యూజ్ అవుతుంది. ఈ సీజన్‌లో ప్రత్యేకమైన ప్లాటినం ఆభరణాలు మీ స్టైల్ ను మరింత మెరుగు పర్చనున్నాయి.
 
నక్షత్రాల నుంచి పుట్టిన ప్లాటినం అరుదైన లోహాలలో ఒకటి‌. ఇది విలువైన లోహం కూడా. వీటిని అలంకరించుకునే మహిళలను ప్రత్యేకంగా ఉంచుతుంది. ప్లాటినం ఇతర లోహాల వలే కాకుండా.. దాని రూపాన్ని తెల్లటి మెరుపును కోల్పోదు. స్త్రీలకు'ఎవారా' స్ఫూర్తివంతంగా ఉంటుంది. ప్లాటినం అంతర్గత, అరుదైన లోహం. ఈ తరం మహిళలకు ఎంతో హుందాగా ఉండే ఉంటుంది. 95 శాతం స్వచ్ఛతతో కూడినది. ప్లాటినం ఎవారా కొత్త సేకరణలో ఆకర్షణీయమైన నెక్లెస్‌లు, ఆకట్టుకునే మణికట్టు నుంచి క్లిష్టమైన చెవిపోగులు, సొగసైన రింగ్‌ల వరకు అనేక రకాల డిజైన్‌లు ఉన్నాయి. ప్రత్యేకమైన డైమండ్ ముక్కలతో కలిపి సృష్టించడంతో ఏ దుస్తులకైనా అందాన్ని ఇస్తుంది ‌
 
ప్లాటినం ఎవరా స్టైలింగ్ ప్లాటినం చెవిపోగులు
మెరిసే వజ్రాలు పొదిగిన డాంగ్లింగ్ ప్లాటినం బార్‌లు, సున్నితమైన డ్యూయల్ టోన్డ్ స్పోక్స్‌లను కలిగి ఉన్న పూల మోటిఫ్ చెవిపోగులు కలవు. సంక్లిష్టంగా డిజైన్ చేసిన స్టడ్‌లు, ప్లాటినం చెవిపోగులు ఏ సందర్భానికి అయినా అందంగానే ఉంటాయి. వీటిని వివిధ రకాలుగా అలంకరించుకోవచ్చు. కాక్‌టెయిల్ పార్టీ లేదా వివాహ వేడుకలో వాడవచ్చు. మ్యాచింగ్ నెక్‌వేర్, రిస్ట్‌వేర్‌తో వాడవచ్చు. 
 
ప్లాటినం ఎవారా స్టైలింగ్ ప్లాటినం రిస్ట్‌వేర్
మిక్సింగ్, మ్యాచింగ్ అనేది ప్లాటినం బ్రాస్‌లెట్‌లను స్టైల్ గా వాడటానికి ఉపయోగించవచ్చు. సొగసైన లుక్ కోసం ప్లాటినం బ్రాస్‌లెట్‌ల సెట్‌న ధరించండి. లేయర్డ్ లుక్‌ కోసం విభిన్న పరిమాణాలు, ఆకారాలు, మోటిఫ్‌లు, టోన్‌ల బ్రాస్‌లెట్‌లను ఎంచుకోండి. ఈ బ్రాస్‌లెట్‌లు వర్క్‌వేర్‌తో పాటు పార్టీవేర్ రెండింటికీ ఉపయోగించవచ్చు. వీటిని ఆఫీసు, క్రిస్మస్ పార్టీలు, కుటుంబ విందులు, గెట్‌టుగెదర్‌ల కోసం వాడవచ్చు.
 
ప్లాటినం ఎవరా స్టైలింగ్ ప్లాటినం నెక్‌వేర్
పర్ఫెక్ట్ ప్లాటినం నెక్‌వేర్‌ను ఎంచుకోవడానికి వచ్చినప్పుడు.. ప్రత్యేక శైలి, వ్యక్తిత్వానికి సరిపోయేదాన్ని ఎంచుకోవచ్చు. ప్లాటినమ్ చెవిపోగులు, రిస్ట్‌వేర్ లేదా ఉంగరాలు పరిపూర్ణంగా ఉంటాయి.
 
ప్లాటినం ఎవరా స్టైలింగ్ ప్లాటినం రింగ్స్
ప్లాటినం రింగ్స్ మీ రూపానికి సరికొత్త అందాన్ని చేకూరుస్తాయి. దుస్తులను ఎలివేట్ చేయడానికి ప్లాటినమ్ రింగ్‌ను ఎంచుకోవచ్చు. వేర్వేరు పరిమాణాలు, ఆకారాల రింగ్‌లను లేయర్‌గా వేసేటప్పుడు స్టాకింగ్‌తో ప్రయోగం చేయండి. మీ గర్ల్‌ఫ్రెండ్‌లతో బ్రంచ్ కోసం లేదా నూతన సంవత్సర వేడుకలో కూడా ఈ సంవత్సరాన్ని ఆకర్షణీయంగా ఎండ్ చేయడానికి ధరించండి. భారతదేశంలోని ప్రముఖ జ్యువెలరీ రిటైల్ స్టోర్‌లలో అందుబాటులో ఉన్నాయి.