గురువారం, 23 జనవరి 2025
  1. ఇతరాలు
  2. మహిళ
  3. ఫ్యాషన్
Written By
Last Updated : గురువారం, 8 నవంబరు 2018 (15:13 IST)

బ్యాగులపై నల్లని మరకలు పోవాలంటే..?

ఈ రోజుల్లో ఎక్కడికి వెళ్లాలన్నా బ్యాగులు లేకుండా వెళ్లలేకపోతున్నారు. ఆ బ్యాగులు శుభ్రంగా ఉంటేనే కదా.. వాటిని ఉపయోగిస్తాం.. మరి ఆ బ్యాగులు కొత్త వాటిలా మెరిసిపోవాలంటే ఇలా చేసి చూడండి..
 
1. బ్యాగులపై నల్ల మరకలు ఉంటే దానిపై తెలుపు రంగు బూట్ పాలిష్ అద్ది స్పాంజ్‌తో శుభ్రం చేయాలి. ఇలా చేయడం వలన నల్ల మరకలు పోయి బ్యాగులు కొత్తగా మెరుస్తాయి. 
 
2. లెదర్ బ్యాగులపై కెచప్, కూరలు, మరకలు పడినప్పుడు అరటిపండు తొక్కతో రుద్ది పొడి టిష్యూతో తుడిచేయాలి. దాంతో లెదర్ బ్యాగు కొత్తగా కనిపిస్తుంది. 
 
3. నూనె, గ్రీజ్ మరకలు బ్యాగులపై ఉంటే.. వాటిని శుభ్రం చేయడం చాలా కష్టం. ఆ మరకలపై వంటసోడా లేదా మెుక్కజొన్న పిండి చల్లి మరునాడు దూదితో తుడిచేస్తే మరకలు పోతాయి. 
 
4. తెల్లని బ్యాగులపై పెన్ను గీతులు పడినప్పుడు గోళ్ల రంగు రిమూవర్‌లో దూదిని ముంచి ఆ ప్రాంతంలో అద్దాలి. ఇలా చేసినప్పుడు ఆ మరకలు దూదికి అంటుకుంటాయి. ఆ తరువాత గోరువెచ్చని నీటిలో వస్త్రాన్ని ముంచి మరోసారి బ్యాగు శుభ్రం చేసుకుంటే సరిపోతుంది.