ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. మహిళ
  3. ఫ్యాషన్
Written By ఐవీఆర్
Last Modified: మంగళవారం, 6 జూన్ 2023 (23:18 IST)

కొత్త గేమ్ ఛేంజ్ కేటగిరీని మొదలుపెట్టిన లెన్స్ కార్ట్- లెన్స్ కార్ట్ బూస్ట్ పేరుతో స్పోర్ట్స్ ఐవేర్ ప్రారంభం

image
రోజువారీ కార్యాచరణ, ఫ్యాషన్... ఈ రెంటిని సమ్మిళితం చేసి సరికొత్త ఐవేర్ డిజైన్స్‌ని రూపొందించడం లెన్స్ కార్ట్ యొక్క ప్రాథమిక సూత్రం. ఇప్పుడు లెన్స్ కార్ట్ స్పోర్ట్స్ సంబంధించిన సరికొత్త కేటగిరీని ప్రారంభించింది. లెన్స్ కార్ట్ బూస్ట్ పేరుతో ఈ సరికొత్త ఉత్పత్తులను అందిస్తోంది. ఇందులో మళ్లీ నాలుగు సబ్ కేటగిరీలు ఉన్నాయి. అవే రన్, రైడ్, స్విమ్ మరియు ఆల్ స్పోర్ట్. ఉత్పత్తులు స్పోర్ట్స్‌కు సంబంధించినవి అయినా కూడా అవి అందరికి నచ్చేలా, రోజువారీ జీవితంలో అందరూ ఉపయోగించుకునేలా రూపొందించారు.
 
క్లియర్ వ్యూస్ నుంచి పర్ ఫెక్ట్ గ్రిప్ వరకు... అది ఏ స్పోర్ట్ అయినా కానీ... లెన్స్ కార్ట్ బూస్ట్... సరికొత్త మరియు స్టైలిష్ ఐవేర్‌ను ప్రత్యేకంగా రూపొందించింది. ఇంతకుముందు స్పోర్ట్స్ అన్నింటికి ఒకటే ఐవేర్ ఉండేది. కానీ ఇప్పుడు లెన్స్ కార్ట్ బూస్ట్ లో ప్రతీ స్పోర్ట్‌కు దేనికదే ప్రత్యేకమైన ఐవేర్ అందుబాటులో ఉంది. క్రీడాకారులు వారి లిమిట్స్‌కు మించిన కష్టపడినా కూడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వీటిని రూపొందించారు. క్రీడాకారులు వేగంగా పరిగెత్తుతున్నప్పుడు, స్విమ్ చేస్తున్నప్పుడు, సైక్లింగ్ టైమ్ లోనో చల్లగాలితో ఇబ్బందిపడతారు. అందుకే యాంటీ ఫాగ్ కోసం ఇందులో పవర్‌డ్ లెన్స్ ఫీచర్ ఉంది. కంఫర్ట్ మరియు సేఫ్టీని దృష్టిలో పెట్టుకుని, అడ్జెస్ట్ చేయగల నోస్ ప్యాడ్‌లను ఇందులో అమర్చారు. వాటి చుట్టూ రబ్బర్ టెంపుల్స్ అమర్చారు. దీనివల్ల రైడ్‌లో అద్దాలు జారిపోవడం, కిందపడిపోవడం ఉండదు. అంతేకాకుండా ఇవి విరిగిపోకుండా పోలీకార్పోనోట్‌తో తయారు చేశారు. మరోవైపు యాంటి గ్లేర్ కోసం పోలరైజ్‌డ్ మిర్రర్ లెన్స్‌లను ఉపయోగించారు.
 
ఏమాత్రం ఇబ్బంది లేకుండా మరియు తేలికగా ఉంటాయి ఈ అద్దాలు. అంతేకాకుండా అద్భుతమైన విజన్‌ను, చాలా క్లియర్‌గా కన్పిస్తాయి. వివిధ రకాల క్రీడలకు కావాల్సిన దృష్టి శక్తిని ఇవి మరింత మెరుగుపరుస్తాయి. మెరుగైన స్పష్టత కోసం యాంటీ-గ్లేర్ మిర్రర్ ఫినిషింగ్ లెన్స్‌లు, మీకు ఎల్లప్పుడూ మీ ముందు ఉండే లక్ష్యాల్ని స్పష్టంగా చూసేలా ఉంటాయి.
 
లెన్స్ కార్డ్ బూస్ట్‌తో మీరు గేమ్‌ని చూసే విధానాన్ని మార్చుకుంటారు. మరింత అద్భుతంగా మీ ఆట తీరుని మార్చేలా వీటిని రూపొందించారు. గతంలో కంటే మీ ఆటతీరులో ఇవి కచ్చితమైన మార్పుని సూచిస్తాయి. ఇవి అత్యుత్తమ పరెఫార్మెన్స్‌కు అనుకూలమైనవి మరియు మీకు స్పోర్ట్స్ సన్ గ్లాసెస్ యొక్క అల్టిమేట్ రేంజ్‌ని అందిస్తాయి. ప్రతీ స్పోర్ట్‌కు ప్రత్యేకంగా రూపొందించిన లెన్స్ కార్డ్ బూస్ట్ ఐవేర్‌లో రన్, రైడ్, స్విమ్, ఆల్ స్పోర్ట్ కేటగిరీకి సంబంధించిన వాటిల్లో అన్ని ఐవేర్ అందుబాటులో ఉంది.