ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. మహిళ
  3. ఫ్యాషన్
Written By ఐవీఆర్
Last Modified: సోమవారం, 29 మే 2023 (13:40 IST)

8 గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ టైటిల్స్ సాధించి చరిత్ర సృష్టించిన శివ నారాయణ్ జ్యువెలర్స్

Disha patanni
హైదరాబాద్‌లోని అగ్ర శ్రేణి వారసత్వ ఆభరణాల సంస్థ ,శివ నారాయణ్ జ్యువెలర్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఎనిమిది (8) గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ టైటిల్స్ సాధించి, చరిత్రలో అటువంటి ఘనతను సాధించిన మొదటి భారతీయ ఆభరణాల వ్యాపార సంస్థగా అవతరించింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని, ప్రముఖులు మరియు సెలబ్రటిలు హాజరు కాగా ఒక భారీ వేడుకను హైదరాబాద్‌లో చారిత్రక వైభవానికి ప్రతీకగా నిలిచే, శివనారాయణ మహోన్నత వారసత్వాన్ని ప్రశంసించడానికి సరైన వేదికగా ప్రతిబింబించే తాజ్ ఫలక్‌నుమా ప్యాలెస్‌లో నిర్వహించారు.  
 
ఈ భారీ వేడుకలో బాలీవుడ్ ఫ్యాషన్ ఐకాన్ దిశా పటానీ, శివ నారాయణ్ యొక్క అత్యున్నత ఆభరణాలను ధరించి ర్యాంప్‌పై ప్రదర్శించారు. దివి నుంచి భువికి వచ్చిన దేవకన్యలా ఆమె ర్యాంప్ పైన నడిచి వస్తుంటే, ఆభరణాల సంక్లిష్టత మాత్రమే కాకుండా హస్తకళ నైపుణ్యం మరియు వాటి గాంభీర్యత సైతం అంతే గొప్పగా ప్రదర్శితమయ్యాయి. ఈ సాయంత్రం ఫ్యాషన్, గ్లామర్ మరియు సున్నితమైన ఆభరణాల ఆకర్షణీయమైన ప్రదర్శనగా ఆవిష్కృతమైంది, అయితే కార్యక్రమం లో మరో ఆకర్షనీయమైన అంశంగా అపూర్వమైన 'ఎక్స్‌పీరియన్షియల్ జోన్' నిలిచింది. రికార్డ్-బ్రేకింగ్ ఆభరణాల యొక్క లీనమయ్యే అనుభవాలను ఇది అందించింది. ప్రతి క్రియేషన్‌కూ తగినట్లుగా అంకితమైన నాలుగు జోన్‌లు, ఆభరణాల ప్రేరణలు, ఆవిష్కరణలు మరియు సూక్ష్మ నైపుణ్యాలను ప్రదర్శించాయి. ఈ నాలుగింటిలో మొదటిది, గణేష్ లాకెట్టు, 1011.150 గ్రాముల బరువున్న అత్యంత బరువైన లాకెట్టు & లాకెట్టుపై ఉంచిన అత్యధిక సంఖ్యలోని వజ్రాలు (11,472) గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ టైటిల్‌ను సాధించింది. సున్నితమైన పనితనానికి నిదర్శనం గా చేతితో తయారు చేసిన ఈ ఆభరణాన్ని రూపొందించడానికి 6 ½ నెలలు సమయం పట్టింది.
 
శివ నారాయణ్ జ్యువెలర్స్ తమ సొంత రికార్డును బద్దలు కొట్టారు: రామ్ దర్బార్ 1681.820 గ్రాముల భారీ లాకెట్టు మరియు 54,666 వజ్రాలతో ఒక పెండెంట్‌పై ఉంచిన అత్యదిక వజ్రాల కోసం ప్రపంచ రికార్డును సాధించింది. ఈ  హెవీయెస్ట్ డైమండ్‌ను  8 ½ నెలల పాటు కష్టపడి రూపొందించారు. ఈ లాకెట్టు వెనుక భాగంలో కూడా శ్రీరామ్ అని రాసి ఉన్న వజ్రాలతో  రూపొందించబడింది.
 
సత్లాద నెక్లెస్ (ది సెవెన్ లేయర్ నెక్లెస్) శివ నారాయణ్ యొక్క మూడవ అవార్డ్ విన్నింగ్ మాస్టర్ పీస్. 315 పచ్చలు మరియు 1971 ఫైన్ డైమండ్స్ తో రూపొందించబడినది. ఇది ఇప్పుడు నెక్లెస్‌పై అత్యధిక పచ్చలు మరియు నెక్లెస్‌పై అత్యధిక వజ్రాల కలిగిన రికార్డులను కలిగి ఉంది. ఈ నెక్లెస్ కోసం మాత్రమే రత్నాల ను ఎంపిక చేయటానికి 2 ½ సంవత్సరాలు పట్టింది మరియు ఈ ఆభరణం తయారు చేయటానికి 5 ½ నెలల సమయం పట్టింది. శివనారాయణ యొక్క వారసత్వంలో అంతర్భాగమైన నిజాంల పురాతన సంపదకు నివాళులు అర్పిస్తూ, ప్రతి ఆభరణంలో కనిపించే శివ నారాయణ్ యొక్క అంకితభావం మరియు శ్రద్ధకు ప్రతీకగా సత్లాద నెక్లెస్ అద్భుతమైన సృష్టి నిలుస్తుంది. లగ్జరీని నూతన శిఖరాలకు తీసుకుని వెళ్తూ, శివ నారాయణ్ జ్యువెలర్స్ యొక్క మాగ్నిఫైయింగ్ గ్లాస్ $108,346 ఆకట్టుకునే విలువను కలిగి ఉంది, ఇది అత్యంత ఖరీదైన భూతద్దంగానూ నిలిచింది.
 
ఈ ప్రతిష్టాత్మక విజయానికి తన సంతోషం మరియు కృతజ్ఞతలు వెల్లడిస్తూ, శ్రీ తుషార్ అగర్వాల్, మేనేజింగ్ డైరెక్టర్- శివ నారాయణ్ జ్యువెలర్స్ ప్రైవేట్ లిమిటెడ్, "మేము 8 గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ టైటిల్స్ సాధించడం నిజంగా గర్వంగా ఉంది. ఇది మొత్తం పరిశ్రమకు గొప్ప పురోగతిగానూ నిలుస్తుంది మరియు మా అంకితభావం, కృషి మరియు అభిరుచి,  ప్రపంచ స్థాయిలో గుర్తించబడినందుకు మేము  కృతజ్ఞులమై ఉంటాము. పరిశ్రమలో నూతన ఆవిష్కరణలకు మార్గదర్శకత్వం వహించడం తో పాటుగా నూతన శిఖరాలకు చేరుకోవాలని మేము ఆశిస్తున్నాము." అని అన్నారు.