సోమవారం, 25 నవంబరు 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. కథనాలు
Written By ఐవీఆర్
Last Modified: శుక్రవారం, 2 జూన్ 2023 (18:35 IST)

ప్రతిపాదిత 20% టీసీఎస్‌పై స్పష్టత కోసం పిలుపునిస్తున్న విదేశీ నగదు మార్పిడి పరిశ్రమ

image
జూలై 1, 2023 నుండి అమల్లోకి వచ్చే సరళీకృత చెల్లింపు పథకం (LRS) కింద, మూలం వద్ద 20% పన్ను వసూలు (TCS) వర్తింపు గురించి నగదు మార్పిడి పరిశ్రమ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. మే 19, 2023న ఆర్థిక మంత్రిత్వ శాఖ, డెబిట్ మరియు క్రెడిట్ కార్డ్‌లను ఉపయోగించి విదేశాలలో నిర్వహించే లావాదేవీలకు TCS నుండి ఒక ఆర్థిక సంవత్సరానికి అతి తక్కువ మొత్తం రూ.7 లక్షల వరకు మినహాయింపు ఉంటుంది అని స్పష్టం చేసింది. అయితే, విదేశీ కరెన్సీ నగదు, బ్యాంకుల ద్వారా వైర్ బదిలీలు, ప్రీ-పెయిడ్ ఫారెక్స్ కార్డ్‌లు మరియు ఇతర అంతర్జాతీయ చెల్లింపు అవకాశాలతో కూడిన చిన్న విలువ లావాదేవీలకు సంబంధించి మరీ ముఖ్యముగా విరామ (Leisure) లేదా ఉపాధి కోసం విదేశీ పర్యటనల సమయంలో వ్యక్తులు విస్తృతంగా ఉపయోగించే మొత్తానికి సంభందించిన నిర్దిష్ట వివరణ ఇవ్వలేదు. ఆల్ ఇండియా అసోసియేషన్ ఆఫ్ ఆథరైజ్డ్ మనీ ఛేంజర్స్ & మనీ ట్రాన్స్‌ఫర్ ఏజెంట్లు పైన పేర్కొన్న ఆందోళనలకు సంబంధించి ఆర్థిక మంత్రిత్వ శాఖకు ఒక రిప్రజెంటేషన్ సమర్పించారు.
 
ఆల్ ఇండియా అసోసియేషన్ ఆఫ్ ఆథరైజ్డ్ మనీ ఛేంజర్స్ & మనీ ట్రాన్స్‌ఫర్ ఏజెంట్స్ జనరల్ సెక్రటరీ భాస్కర్ రావు పి మాట్లాడుతూ, "ఉపయోగించిన మార్గంతో సంబంధం లేకుండా 7 లక్షలు రూపాయల చిన్న విలువలతో అన్ని విదేశీ లావాదేవీలకు ప్రభుత్వం ఒకే స్థాయి అవకాశాలు ఉండేలా చూస్తుందనే భరోసా ను మనీ ఎక్స్ఛేంజ్ పరిశ్రమ ఆశిస్తోంది. సామాన్య ప్రజలు విదేశీ కరెన్సీ నగదు (గరిష్టంగా USD 3000 వరకు), ప్రీపెయిడ్ ఫారెక్స్ ట్రావెల్ కార్డ్‌లు మరియు వైర్ బదిలీలను ఉపయోగించుకుంటారు, అయితే ఉన్నత తరగతి ప్రజలు అంతర్జాతీయ డెబిట్ మరియు క్రెడిట్ కార్డ్‌లను ఉపయోగిస్తున్నారు " అని అన్నారు.
 
DGCA ప్రచురించిన ఇమ్మిగ్రేషన్ డేటా ప్రకారం, 60 శాతం కంటే ఎక్కువ మంది విదేశీ యాత్రికులు మొదటిసారి ప్రయాణించేవారు. ఈ వ్యక్తులు తక్కువ విద్యావంతులు, ఆర్ధికంగా బలహీనులు. డెబిట్ లేదా క్రెడిట్ కార్డ్‌లను వెంట పెట్టుకోరు, డెబిట్ మరియు క్రెడిట్ కార్డులు పెద్దగా వినియోగించరు. అందువల్ల డెబిట్ మరియు క్రెడిట్ కార్డుదారులతో సమానంగా చూడాల్సిన ఆవశ్యకత ఉంది. ఈ నోటిఫికేషన్, ఉపాధి కోసం విదేశాలకు వెళ్లే వ్యక్తులపై నేరుగా ప్రభావం చూపుతుంది, ముఖ్యంగా తక్కువ-ఆదాయ వర్గానికి చెందిన మరియు క్రెడిట్ కార్డ్‌లకు అనర్హులైన కార్మికులు/శ్రామిక వర్గంపై ప్రభావం చూపుతుంది. ఈ ప్రయాణికులు సాధారణంగా అంతర్జాతీయ విమానాశ్రయాలు లేదా సిటీలోని మనీ ఎక్స్ఛేంజ్ అవుట్‌లెట్‌ల నుండి నగదు లేదా ప్రీపెయిడ్ కార్డ్ రూపంలో విదేశీ మారక ద్రవ్యాన్ని సేకరిస్తారు. ఆదాయపు పన్ను పరిధిలోకి వారు రాకపోవడంతో 20% TCS విధించడం వారిపై పెను ప్రభావం చూపుతుంది.
 
క్రెడిట్ మరియు డెబిట్ కార్డ్‌లకు ఇచ్చిన సడలింపుతో, ఎగువ మధ్యతరగతి మరియు ధనిక కస్టమర్‌లు రూ. 7 లక్షల వరకు TCS చెల్లించకుండా ఉండగలరు. అదే సమయంలో తమ ఖాతా నుండి చెల్లించడం ద్వారా విదేశీ మారక ద్రవ్యాన్ని పొందే దిగువ మధ్యతరగతి కస్టమర్లు, గృహిణులు మరియు సీనియర్ సిటిజన్‌లు 20% TCSకి లోబడి ఉంటారు. పన్నులు దాఖలు చేయాల్సిన అవసరం లేని ఈ కస్టమర్‌లకు తీవ్ర నష్టం కలిగిస్తుంది మరియు ఇది భారతదేశంలో లైసెన్స్ పొందిన విదేశీ మారక ద్రవ్య వ్యాపారులను గణనీయంగా దెబ్బతీస్తుంది. సంవత్సరానికి 7 లక్షల రూపాయల TCS మినహాయింపు నగదు ఫారెక్స్ కొనుగోళ్లు, వైర్ ట్రాన్సఫర్ లు, ప్రీపెయిడ్ ఫారెక్స్ కార్డులు కు కూడా వర్తిస్తుందని పరిశ్రమ శాఖ/ప్రభుత్వం మరింత స్పష్టత ఇవ్వాలని పరిశ్రమ భావిస్తోంది.