శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. కథనాలు
Written By ఐవీఆర్
Last Modified: గురువారం, 18 ఏప్రియల్ 2024 (20:34 IST)

బాల్కోట్ & బియాండ్ టీవీ సీరిస్ ట్రైలర్‌ను ఆవిష్కరించిన జియో సినిమా

image
అన్ని యుద్ధాలు గెలవలేం. అలాగే పోరాడే ప్రతీ సైనికుడు యూనిఫాం ధరించాడు. ఈ ఒక్క లైన్ చెప్పేస్తుంది రణ్ నీతి- బాలాకోట్ & బియాండ్ ఎలా ఉండబోతుందో. జియో సినిమా సగర్వంగా సమర్పిస్తున్న రణ్ నీతి- బాలాకోట్ & బియాండ్ కు సంబంధించిన ట్రైలర్ రిలీజ్ అయ్యింది. అందర్నీ విశేషంగా ఆకట్టుకుని ఆలోచింప చేసేలా ఉంది ఈ ట్రైలర్. కాల్పనిక వార్ రూమ్ డ్రామాగా తెరకెక్కిన రణ్ నీతి: బాలాకోట్ & బియాండ్ భారతదేశపు అతిపెద్ద డిఫెన్స్ ఆపరేషన్ ను మీకు చూపించబోతోంది. ఈ టీవీ సిరీస్ ఏప్రిల్ 25, 2024 నుంచి జియో సినిమాలో  విడుదల అవుతుంది. ఈ అద్భుతమైన కథ, కథనాలకు జిమ్మీ షెర్గిల్, లారా దత్తా, అశుతోష్ రాణా, ఆశిష్ విద్యార్థి మరియు ప్రసన్న లాంటి బాలీవుడ్ ప్రముఖులు మరింత హైప్ ని తీసుకువచ్చారు.
 
ఇంకా చెప్పాలంటే ఈ వెబ్-సిరీస్ మొట్టమొదటిసారిగా ఆధునిక యుద్ధాన్ని డీకోడ్ చేస్తుంది. ఇది కేవలం సరిహద్దుల్లో ఉండి చేసే పోరాటం కాదు. సామాజిక మీడియా, డిజిటల్ వ్యూహాలు మరియు భౌగోళిక రాజకీయాలను మేళవించి ఉన్న రహస్య రాజకీయ ఎత్తుగడలను ఎలా అధిగమించాం అన్నదే అసలు కథ. సంతోష్ సింగ్ దర్శకత్వం వహించిన ఈ సిరీస్‌ను స్పిరియోరిజిన్స్ మల్టీవిజన్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్ పై సన్‌జోయ్ వాధ్వా మరియు కమాల్ సంజయ్ నిర్మించారు. దేశాన్ని కదిలించిన నిజ జీవిత సంఘటనల నుండి ప్రేరణ పొందిన కథాంశంతో దీన్ని రూపొందించారు. సినిమాటిక్ ఎక్సలెన్స్‌లో కొత్త బెంచ్‌మార్క్‌లను సెట్ చేస్తూ భారీ స్థాయిలో చిత్రీకరించబడింది ఈ టీవీ సిరీస్.
 
భారతదేశం యొక్క అతిపెద్ద, అత్యంత ప్రజాదరణ పొందిన యుద్ధ భూమిలో రక్షణ ఆపరేషన్లో జరిగే ప్రతి అంశాన్ని ఇందులో ప్రధానంగా హైలెట్ చేశారు. అన్నింటికి మించి వైమానిక సన్నివేశాలు అద్భుతం. ఇక నటీనటులు పర్ఫార్మెన్స్, అద్భుతమైన కథ, కథనాలతో ఈ వెబ్-సిరీస్ అన్నింటికంటే భిన్నంగా సినిమాటిక్ అనుభవాన్ని అందిస్తుంది.
 
ట్రైలర్ లాంచ్ సందర్భంగా జిమ్మీ షెర్గిల్ తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... "ఇది గతంలో నేను చేసిన అన్ని పాత్రల కంటే భిన్నంగా ఉంది. ఇంకా చెప్పాలంటే నేను చెప్పేది చాలా తక్కువ. భారతదేశం యొక్క మొట్టమొదటి వార్-రూమ్ ఫోకస్డ్ వెబ్-సిరీస్ స్ఫూర్తితో భాగం కావడం చాలా సంతృప్తినిచ్చింది. దేశాన్ని కుదిపేసిన నిజ జీవిత సంఘటనల గురించి మనం చదువుతాము లేదా వింటాము. కాని తొలిసారి ఆ అనుభవాన్ని చూసేసరికి ఎంతో భావోద్వేగంగా అన్పించింది. యూనిట్ మొత్తం యూనిట్ విరామం లేకుండా 48 గంటలపాటు పనిచేసినప్పుడు షెడ్యూల్ నాకు ఇంకా గుర్తింది. ప్రతీ ఒక్కరూ నిద్రలేకండా పనిచేశారు. ఇలాంటి అద్భుతమైన సిరీస్ లో భాగమైనందుకు చాలా ఆనందంగా ఉంది అని అన్నారు ఆయన.
 
ఈ సందర్భంగా నటుడు అశుతోష్ రానా మాట్లాడారు. ఆయన మాట్లాడుతూ... “ప్రతి ఛాలెంజింగ్ షో లేదా సినిమా తర్వాత, నేను నటుడిగా ఎదిగినట్లుగా ఎప్పుడూ భావిస్తాను. భారతదేశ రాజకీయాలు మరియు రక్షణ తత్వశాస్త్రంలో రణ్ నీతి లాంటి సిరీస్ చేయండ ఒక క్రాష్-కోర్సు లాంటిది. చాణక్యనీతి అనేది కేవలం ఒక పదం కాదు. ప్రమాదంలో ఉన్నప్పుడు, యుద్ధం అనేది గది గోడల లోపల మంత్రం! నాలాంటి కరడుగట్టిన దేశభక్తుడికి శత్రువును ఎదిరించడం అంత తేలిక కాదు. అయితే, ఇలాంటి పాత్రలు నటులుగా మనకు సవాలు విసురుతాయి అని అన్నారు ఆయన.
 
మరోవైపు ఆశిష్ విద్యార్థి మాట్లాడుతూ.. “రణ్ నీత్ లాంటి సిరీస్ చేసే అవకాశం అప్పుడప్పుడు వస్తుంది. NSA చీఫ్ పాత్రను పోషించడం సవాలుగా ఉంది. అయితే రక్షణ దళాలకు చెందిన కొంతమంది సభ్యులతో సమావేశాలు నా పాత్ర తాలూకు లక్షణాలను సంగ్రహించేందుకు ఎంతగానో ఉపయోగపడింది. ప్రిపరేషన్ మరియు వర్క్‌షాప్‌లు నన్ను నా NSD రోజులకు తీసుకెళ్లాయి. అంత స్థాయి ఉన్న పాత్రను పోషించడం అంత సులభం కాదు, కానీ సంతోష్ మన నుండి ఉత్తమమైన నటనను రాబట్టాడు. పాత్రలకు వీలైనంత ప్రాణం పోసేందుకు మరియు ప్రతీది ప్రామాణికమైనదిగా ఉండేందుకు అతను ప్రతి చిన్న చిన్న వివరాలపై కూడా శ్రద్ధ వహించాడు" అని అన్నారు ఆయన.
 
పవర్ బ్రోకర్‌గా నటించిన లారా దత్తా షూటింగ్ అనుభవం గురించి మాట్లాడుతూ, “వార్-రూమ్‌లో స్ప్లిట్-సెకండ్ డెసిషన్ మేకింగ్ మరియు ఒత్తిడి ఇతర వాటికి భిన్నంగా ఉంటుంది. నటులుగా, ఆ భావోద్వేగాలను నిజాయితీగా మరియు ప్రామాణికమైన రీతిలో అనువదించడం చాలా కష్టమైన పని. అయితే, మీరు రణ్ నీతి వంటి అద్భుతమైన బృందంతో పని చేసినప్పుడు, మీరు ప్రతి ఒక్క సన్నివేశం మరియు డైలాగ్ డెలివరీతో నటుడిగా అద్భుతంగా ఎదుగుతారు. వాయుసేన నేపథ్యం నుండి వచ్చినందున, ఇలాంటి చోట పని చేయడం ఇంటికి దగ్గరగా ఉన్నట్లు అనిపించింది. సెట్ లో మేం ప్రతీ రోజూ చాలా కష్టపడ్డాం. అందుకే దానికి ప్రేక్షకుల స్పందన ఎలా ఉంటుందా, ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారా అనే విషయం కోసం ఎదురుచూస్తున్నాం అని అన్నారు ఆమె.
 
ఇక గ్రూప్ కెప్టెన్ పాత్రలో నటించిన ప్రసన్న ఈ సందర్భంగా మాట్లాడుతూ.. “జాతీయ హీరో పాత్రను పోషించడం నాకు గర్వకారణంగా ఉంది. నేను కేవలం స్క్రిప్ట్‌ని ఫాలో అయిపోయాను. కానీ అసలు ఆపరేషన్‌లో పాల్గొన్న వారి సేవలు చూసి నా ఒళ్లు పులకరించింది. దేశం పట్ల వారికున్న అసమానమైన ప్రేమతో స్క్రిప్ట్ సరికొత్త చరిత్రను సృష్టించింది. గ్రూప్ కెప్టెన్‌ని పాకిస్తానీ బలగాలు పట్టుకున్నప్పుడు సన్నివేశాలను చిత్రీకరిస్తున్నప్పుడు నాకు అసలైన గూస్ బంప్‌లు అనిపించినట్లు గుర్తుంది. ఆపరేషన్‌లో భాగమైన కొంతమంది సభ్యులను కలవడం నాకు ఒక గొప్ప సమయం. ఆ సమయం నాకు ఎల్లప్పుడూ విలువైనదిగా భావిస్తాను అని అన్నారు ఆయన.