శుక్రవారం, 29 మార్చి 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. వ్యాధి
Written By సిహెచ్
Last Modified: ఆదివారం, 13 సెప్టెంబరు 2020 (20:25 IST)

ఆవిరి పీల్చితే కరోనావైరస్ చస్తుందా?

ఆవిరి పీల్చడం వల్ల శ్వాసకోశ సమస్యలు, నాసికా మార్గం, వాయుమార్గాలలో దిబ్బడ సమస్యలు తగ్గుతాయని నిపుణులు సలహా ఇస్తున్నారు. అయితే ఇది కరోనావైరస్‌ను చంపుతుందనేందుకు ఎలాంటి ఆధారాలు లేవు. ఊపిరితిత్తులు సున్నితమైనవి, వేడి ఆవిరిని పీల్చడం మంచి ఆలోచన కాదని, ఇది ఊపిరితిత్తులు మరియు వాయుమార్గాలను దెబ్బతీస్తుందని టెక్సాస్ యూనివర్శిటీకి చెందిన పరిశోధకులు వెల్లడంచారు.
 
అమెరికన్ లంగ్ అసోసియేషన్ యొక్క చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ ఆల్బర్ట్ రిజ్జో కూడా ఆవిరి పీల్చడం పద్ధతులు శ్వాసకోశ లక్షణాలను తగ్గించడంలో సహాయపడతాయని వెల్లడించారు కానీ అవి వైరస్ నివారణగా పనిచేయవని తెలిపారు.
 
ముక్కు కారడం, దగ్గు, జలుబు కారణంగా ఛాతీలో సమస్య వంటి శ్వాసకోశ లక్షణాలు వున్నవారికి ఆవిరిని పీల్చడం సహాయపడుతుంది. అయినప్పటికీ, ఉపశమనం లక్షణాల తీవ్రతను తగ్గించడంలో మాత్రమే సహాయపడుతుంది. ఇది వైరల్ సంక్రమణకు చికిత్స చేయదు.