Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఫ్యాటీ లివర్ సమస్యను అడ్డుకునే చిట్కాలు

Written By సిహెచ్
Updated: మంగళవారం, 14 అక్టోబరు 2025 (13:20 IST)
ఈ రోజుల్లో చాలామంది ఫ్యాటీ లివర్ సమస్యతో బాధపడుతున్నట్లు వైద్య నిపుణులు చెబుతున్నారు. ఈ సమస్యను తగ్గించుకోవడానికి కొన్ని ముఖ్యమైన ఆరోగ్య చిట్కాలు, జీవనశైలి మార్పులు చేసుకోవాలి. ఈ మార్పులు చాలా వరకు కాలేయంపై పేరుకుపోయిన కొవ్వును తగ్గించడంలో సహాయపడతాయి.
 
ఫ్యాటీ లివర్‌ను తగ్గించడానికి అత్యంత ప్రభావవంతమైన మార్గం క్రమంగా ఆరోగ్యకరమైన బరువును తగ్గించుకోవడం. శరీర బరువులో 5% నుండి 10% తగ్గించుకుంటే కాలేయ కొవ్వు గణనీయంగా తగ్గుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. వేగంగా బరువు తగ్గడం కంటే స్థిరమైన, నెమ్మదైన బరువు.. అంటే వారానికి అరకిలో నుండి కిలో వరకూ తగ్గడానాకి లక్ష్యంగా పెట్టుకోవాలి.
 
ప్రతిరోజూ కనీసం 30-60 నిమిషాలు శారీరక శ్రమ చేయడం లేదా వారానికి కనీసం 150 నిమిషాలు మితమైన వ్యాయామం చేయడం చాలా ముఖ్యం. వ్యాయామం కొవ్వును కరిగించి, జీవక్రియను మెరుగుపరుస్తుంది, కాలేయ ఆరోగ్యానికి దోహదపడుతుంది. మద్యపానం పూర్తిగా మానుకోవడం కాలేయ ఆరోగ్యానికి చాలా ముఖ్యం. సాధారణ చక్కెరలు ఎక్కువగా ఉన్న ఆహారాలు, పానీయాలు అంటే సోడా, పండ్ల రసాలు, స్వీట్లు మానుకోవాలి. తెల్ల అన్నం, మైదా ఉత్పత్తులు... బ్రెడ్, బిస్కెట్లు, పాస్తా వంటి శుద్ధి చేసిన పిండి పదార్థాలను తగ్గించాలి. వేయించిన ఆహారాలు, జంక్ ఫుడ్, అధిక నూనె, కారంగా ఉండే పదార్థాలను పరిమితంగా తినాలి. పూర్తి కొవ్వు పాల ఉత్పత్తులను పరిమితం చేయాలి.
 
కూరగాయలు, పండ్లు, తృణధాన్యాలు... గోధుమలు, ఓట్స్, పప్పులు ఎక్కువగా తీసుకోవాలి. పీచు ఎక్కువగా ఉండే ఆకుకూరలు, కూరగాయలు, తృణధాన్యాలు, గింజలు తీసుకోవాలి. ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ఉన్న ఆహారాలు అంటే సాల్మన్, అవిసె గింజలు, ఆలివ్ ఆయిల్ వంటి ఆరోగ్యకరమైన కొవ్వులను తీసుకోవాలి. ప్రతిరోజూ 2.5 నుండి 3 లీటర్ల నీరు తాగడం ద్వారా శరీరంలో తేమ ఉండేలా చూసుకోవాలి.
 
డయాబెటిస్, అధిక రక్తపోటు లేదా అధిక కొలెస్ట్రాల్ వంటి సమస్యలు ఉంటే, వాటిని నియంత్రణలో ఉంచుకోవడానికి వైద్యుల సలహా మేరకు మందులు తీసుకోవడం, జీవనశైలి మార్పులు పాటించడం తప్పనిసరి. రోజువారీ నిమ్మకాయ, తేనె కలిపిన నీరు త్రాగడం కొంతమందికి సహాయపడుతుంది. పసుపు, వెల్లుల్లి, గ్రీన్ టీ, బెర్రీలు వంటి యాంటీఆక్సిడెంట్లు ఎక్కువగా ఉన్న ఆహారాలు వాపును తగ్గించడంలో సహాయపడతాయి.
 
ముఖ్య గమనిక: ఫ్యాటీ లివర్ ఉన్నవారు ఏవైనా చిట్కాలు లేదా నివారణ మార్గాలను ప్రయత్నించే ముందు తప్పనిసరిగా వైద్య నిపుణుడిని సంప్రదించాలి.

అన్నీ చూడండి

కుమార్తె అక్రమ సంబంధం పెట్టుకుందనీ బిడ్డనూ తల్లిని చంపేసిన కిరాతకుడు...

కన్నతల్లి మరణిస్తే ఫ్రిజ్‌లో భద్రపరిచి మూడేళ్లు పెన్షన్ తీసుకున్న ఘనుడు.. ఎక్కడ?

పార్టీ కోసం దశాబ్దకాలం కష్టపడితే రౌడీషీటర్ అంటారా? సజ్జలపై మండిపడిన బోరుగడ్డ

ఆగష్టు 5, 2026 నాటి తెలుగు రాష్ట్రాల వాతావరణం ఎలా వుందంటే?

ఏ కాంగ్రెస్ ఎమ్మెల్యే అయినా రాజీనామా చేస్తే 2 నిమిషాల్లో ఆమోదిస్తా: సీఎం డికె శివకుమార్ భారీ షాక్

అన్నీ చూడండి

'ఛత్రపతి' విలన్ ఇకలేరు.. కేన్సర్‌తో ముంబైలో కన్నుమూత

Aamani: సీతాకోకలా విహరించే ఏడుగురు మహిళల హ్యాపీ జర్నీ

డెక్స్ట్రోకార్డియా ఉండే అరుదైన కథతో చిరంజీవి రాబోతోంది

Nani: నాని పోషించిన జడల్ పాత్ర ప్రమాదకరమైన గద్దలా ది ప్యారడైజ్ పోస్టర్

Ram: పాండిచ్చేరిలో RAPO23 కోసం పాట, యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణ

తర్వాతి కథనం
Show comments