బుధవారం, 22 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. వ్యాధి
Written By ఎంజీ
Last Updated : గురువారం, 30 సెప్టెంబరు 2021 (08:01 IST)

అతిమూత్ర వ్యాధి తగ్గాలంటే...?

చాలామంది అతి మూత్ర వ్యాధితో బాధపడుతుంటారు. ఆసుపత్రుల చుట్టూ తిరిగి తిరిగి అక్కడ ఇచ్చే మందులు, మాత్రలు వాడుతుంటారు. మొదట్లో మందులు తగ్గినట్లు కనిపించినా ఆ తరువాత యథాప్రకారం మూత్రం వస్తూనే ఉంటుంది. ఈ సమస్యకు చెక్ పెట్టాలంటే.. ఈ చిట్కాలు పాటించండి.. చాలు తక్షణమే ఉపశమనం లభిస్తుంది.
 
1. అతి మూత్ర వ్యాధి తగ్గాలంటే నేరేడు గింజల చూర్ణం 40 రోజులు తినాలి. అలానే అత్తి చెక్క కషాయం తాగుతూ ఉండాలి. వెల్లుల్లిని పూటకు ఎక్కువ చార్లు 10 రోజులు సేవించిన ఈ వ్యాధి తగ్గుతుందట.
 
2. ఉప్పిడి బియ్యం తవుడును, తాటి బెల్లంతో కలిపి మూడురోజుల పాటు తాగాలి. అత్తిపత్తి ఆకు, బెల్లం, సమపాళ్లలో కలిపి నూరి చిన్న ఉసిరి కాయంత తీసుకోవాలి. కసివింద చెట్టు ఎండు గింజలను పొడిచేసి తేనెతో కలిపి మూడు రోజులు భుజించాలి.
 
3. మర్రిచెక్క కషాయంను కూడా తాగాలి. పటిక బెల్లం 3 తులాలు, మిరియాలు 3 తులాలు, శొంఠి 4 తులాలు గ్రహించి చూర్ణం చేయాలి. ఈ చూర్ణాన్ని పూటకు నాలుగవ వంతు చొప్పున నేతిలో కలుపుకుని రోజూ రెండు పూటలా తింటే అతి మూత్ర వ్యాధి తగ్గుతుంది.
 
4. కసివిందాకు 50 గ్రా, కసివింద గింజల చూర్ణం 50 గ్రా, ఉసిరిక చూర్ణం 25 గ్రా, రోజుకు 2 గ్రా చొప్పున మంచి నీటితో కలిపి 5 రోజుల పాటు రోజుకు రెండుపూటలా సేవించాలి. ముదిరిన తుమ్మచెట్టు పట్టను, చితక్కొట్టి నీటిలో కషాయంగా కాచి పూటకు ఒకటి నుంచి 2 స్పూన్ల చొప్పున రెండుపూటలా తాగాలి. ఈ మందు మూత్రంలో చక్కెరను కూడా తగ్గించును. 
 
ఎక్కువసార్లుమూత్రవిసర్జనఎందుకుచేస్తారు?
 
కారణాలు :
ముత్రపరిమానాలు పెరగడం : అవసరానికి మించి నీళ్ళను అధికం గా తీసుకోవడం వల్ల మూత్రం ఎక్కువగా తయారవుతుంది . అతి దప్పి గని , లేదా అలవాటుగా తాగడం గని దీనికి కారణం .

మద్యం ,కాఫే, వంటి పదార్దములు తీసుకోవడం వలన గని , దైయురితిక్ మందులు తీసుకోవడం వలన గాని , మధుమేహ వ్యాధి ఉన్నందున, మెదడు లో దైయురితిక్ హార్మోను ఎక్కువమోతాడు లో తయారవడం వలనా(సెంట్రల్ డయాబిటిక్ ఇన్సిపిడస్),
 
మూత్రవిసర్జన సంఖ్యా పెరగడం : ముత్రకోసం మీద ఒత్తిడి పడటం వల్లకాని , ముత్రకోసం అలజడికి గరి కావడం వవలన మూత్రవిసర్జన సంఖ్యా పెరుగును. మొత్తం మీద విసర్జించే నీరుడు పరిమాణము పెరగదు .
ముత్రమర్గానికి ఇన్ఫెక్షన్ అయినపుడు, మూత్రకోశం లో రాళ్ళు తయారైనపుడు, మూత్రకోశం లో కాంతి పెరగడం వలన, కటివలయం లో కాంతులు పెరిగినపుడు, స్త్రీలు గర్భం దాల్చినపుదు, మగవారిలో ప్రోస్త్రేట్ గ్రంది పెద్దదయినపుడు,
 
విశ్లేషణ_పరీక్షలు :
మూత్రము ఎక్కువ అవుతున్నపుడు , మూత్రము ఎక్కువచేసే మందులు ఏమైనా వడుచున్నరేమో చూడాలి.
ముత్రమార్గం ఇన్ఫెక్షన్ లో .. కడుపునొప్పి , మూత్రము మంట ఉండును, ప్రోస్త్రేట్ గాంధీ పెరిగిందేమో తెలుసుకోవడం కోసం తనికీలు, పరీక్షలు చేయాలి, కిడ్నిలో రాళ్ళు ఉన్నది లేనిది స్కానింగ్, ఎక్షరే వలన తెలుసు కోవాలి. మధుమేహం కోసం నీరుడులో షుగర్ , రక్తంలో షుగర్ పరీక్షలు చేయాలి.