శనివారం, 9 నవంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By
Last Updated : గురువారం, 11 ఏప్రియల్ 2019 (10:22 IST)

ప్రతిరోజూ ఉదయాన్నే వెన్న తింటే.. ఏమవుతుంది..?

వెన్న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. పాల ఉత్పత్తుల్లో వెన్న ఒకటి. వెన్నలోని విటమిన్స్, ప్రోటీన్స్ వంటి ఖనిజాలు అధిక మోతాదులో ఉన్నాయి. శరీర ఇన్‌ఫెక్షన్స్‌ను తొలగించడానికి వెన్నలోని లూరిక్ యాసిడ్ బాగా పనిచేస్తుంది. తరచు వెన్నను ఆహారంలో భాగంగా చేర్చుకోవడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఓసారి తెలుసుకుందాం..
 
వెన్న తినడం వలన తక్షణమే శరీరానికి కావలసిన ఎనర్జీ అందుతుంది. వెన్నలోని ఫ్యాట్‌లో ఉండే కొలెస్ట్రాల్ పిల్లల మెదడు పెరుగుదలకు, నరాల బలానికి ఉపయోగపడుతుంది. ఇందులోని అరాచిడోనిక్ యాసిడ్ బ్రెయిన్ శక్తివంతంగా పనిచేసేట్టు సహాయపడుతుంది. మంచి ఆరోగ్యానికి ఆర్గానిక్ వెన్న చాలా మంచిది. గుండె సంబంధిత వ్యాధులతో బాధపడేవారు.. కల్తీలేని వెన్న తింటే మంచిది.
 
డైట్‌లో ఉన్నవారు తరచు వెన్న తింటే ఫలితం ఉంటుంది. అలానే కీళ్ల నొప్పులతో బాధపడేవారు వెన్న రోజూ తింటుండాలి. వెన్న మహిళలలో సంతానసాఫల్య అవకాశాలను పెంపొందిస్తుంది. వెన్న తినడం వలన ఊబకాయం జారిన పడరు. వెన్నలో కొలెస్ట్రాల్ జీర్ణక్రియకు అవసరమైన లెసిథిన్ ఉంది. దాంతోపాటు యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉన్నాయి. ఇవి శరీరంలో రక్తప్రసరణకు ఎంతగానో దోహదపడుతాయి. 
 
వెన్నలో కొద్దిగా చక్కెర లేదా తేనె కలిపి ప్రతిరోజూ తింటే శరీరానికి కావలసిన పోషకాలు పుష్కలంగా అందుతాయి. 2 స్పూన్ల వెన్నను బ్రెడ్ స్లైసె‌స్‌లో వేసుకుని ఆపై కొద్దిగా చక్కెర వేసి దానిపై మరో బ్రెడ్ స్లై పెట్టి తింటే చాలా రుచిగా ఉంటుంది. రోజూ ఉదయాన్నే ఇలా తింటే.. శరీరంలోని చెడు వ్యర్థ పదార్థాలన్నీ తొలగిపోతాయి. దాంతోపాటు గుండెలోని రక్తనాళాలు దళసరెక్కవు.