గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By సిహెచ్
Last Modified: సోమవారం, 25 ఫిబ్రవరి 2019 (20:17 IST)

ఆకు కూరలా? అంతేగా... అనుకోవద్దు...

మార్కెట్లో అనేక రకాల ఆకు కూరలు అందుబాటులో వుంటాయి. ఆకుకూరల్లో పోషక పదార్ధాలు సమృద్ధిగా ఉంటాయి. వీటిలో పాలకూర, తోటకూర, గోంగూర, మెంతికూర, మునగాకులు, పుదీన తదితరాలు ప్రముఖమైనవి. అందుకే శరీర పెరుగుదల, దృఢత్వానికి, చక్కని ఆరోగ్యానికి ఇవి చాలా ముఖ్యమైనవి. ఆకుకూరలు ఎక్కువగా ఖనిజ పోషకాలు, ఇనుము ధాతువు కలిగి ఉంటాయి. వీటిని ఆహారంలో ఎక్కువగా తీసుకోవడం వలన కొన్ని అనారోగ్య సమస్యల నుండి బయటపడవచ్చు. 
 
1. శరీరంలో ఇనుము లోపం కారణంగా అనీమియా వ్యాధికి గురవుతారు. గర్భవతులు, పాలిచ్చే తల్లులు, పిల్లలు ఈ వ్యాధికి ఎక్కువగా గురవుతారు. ప్రతిరోజూ తీసుకొనే ఆహారంలో ఆకుకూరలను తప్పకుండా చేర్చాలి. తద్వారా అనీమియాను నివారించి, చక్కని ఆరోగ్యాన్ని పొందవచ్చు. 
 
2. ఆకుకూరల్లో కాల్షియం, బీటాకెరోటిన్, విటమిన్ - సి కూడా పుష్కలంగా ఉంటాయి. విటమిన్-ఎ లోపం కారణంగా భారతదేశంలో ప్రతీ యేటా ఐదేళ్ళ లోపు వయస్సు పిల్లలు సుమారు 30 వేల మంది కంటిచూపును కోల్పోతున్నారు. ఆకుకూరలద్వార లభించే కెరోటిన్ మనశరీరంలో విటమిన్-ఎగా మారి అంధత్వం రాకుండా చేస్తుంది. 
 
3. విటమిన్-సి ఆరోగ్యకరమైన ఎముకలు, దంతాలకు చాలా అవసరమైన పోషకం. వంట చేసేటపుడు ఆకుకూరలను ఎక్కువసేపు మరిగిస్తే, వీటిలో ఉన్న విటమిన్ సి ఆవిరైపోతుంది. దీన్ని నివారించటానికీ అకుకూరలను స్వల్ప వ్యవధిలోనే వండాలి. ఆకుకూరల్లో కొన్ని రకాల బి- కాంప్లెక్స్ విటమిన్లు కూడా ఉంటాయి.
 
4. పాలకూర ఆరోగ్యానికి చాలా మంచిది.  రక్తహీనతలతో బాధపడే వారికి పాలకూర మంచి ఔషదంలా పని చేస్తుంది. తాజాగా బరువు తగ్గించే పదార్ధాల జాబితాలలోనికి చేరింది. 
 
5. పాలకూరలోని థైలాకోయిడ్స్ అనే దానివల్ల దాదాపు 43 శాతం బరువు తగ్గుతారు. థైలాకోయిడ్స్ శరీరంలో హార్మోన్ల ఉత్పత్తి పెంచి అతి ఆకలిని తగ్గిస్తుంది. దీనివల్ల ఆకలి చక్కని నియంత్రణలో ఉండి ఆరోగ్యవంతమైన ఆహారపు అలవాట్లు అలవడుతాయి . తద్వారా బరువు తగ్గడము మొదలవుతుంది.